టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఏడాది రెండు బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.చందు మొండేటి దర్శకత్వంలో అనుపమ నిఖిల్ హీరో హీరోయిన్లుగా నటించిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి ఆదరణ పొందిందో మనకు తెలిసిందే.
అయితే ఈ సినిమా సక్సెస్ నుంచి బయటకు రాకుండానే తిరిగి వీరిద్దరి కాంబినేషన్లో పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వచ్చినటువంటి 18 పేజస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇకపోతే ఈ సినిమా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ముందుగా మీడియాకు థాంక్స్ చెప్పారు.తాను న్యూస్ పేపర్ బుక్ మై షో చూస్తున్నాను.మొదటి రోజు ఎన్ని థియేటర్స్ ఉన్నాయో ప్రస్తుతం అంతకుమించి థియేటర్లలో ఈ సినిమా ఆడుతుందని ఈయన సంతోషం వ్యక్తం చేశారు.

ఇదొక బిగ్ అచీవ్మెంట్.18 పేజస్ సినిమా స్లో పాయిజన్.ఈ ఏడాదిలో ఒక్కసారిగా వెను తిరిగి చూసుకుంటే టాప్ 5 ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాలలో మా సినిమా కూడా ఉంటుందని నిఖిల్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సినిమాని ఎలా ఆదరిస్తారోనని మొదట్లో టెన్షన్ పడ్డాను అయితే ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసే చాలా సర్ప్రైజ్ అయ్యానని నిఖిల్ తెలిపారు.ఒక మంచి కథను బ్యూటిఫుల్ గా చెప్తే మా సినిమాల ఉంటుందని తెలియజేశారు.
ఇక ఈ ఏడాది తన సినీ కెరియర్ లోనే ది బెస్ట్ ఇయర్ అంటూ ఈ సందర్భంగా నిఖిల్ 18 పేజస్ సక్సెస్ మీట్ కార్యక్రమంలో చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







