రెండేళ్ల తర్వాత 'ధమాకా'తో పండుగ వచ్చింది.. మాస్ మీట్ లో రవితేజ!

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ధమాకా’.ఈ సినిమా మొన్న క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయ్యిన విషయం విదితమే.

 Raviteja Dhamaka Maas Meat Details , Dhamaka Mass Meat, Ravi Teja, Dhamaka Movie-TeluguStop.com

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.డిసెంబర్ 23న రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ తో దూసుకు పోతుంది.

రవితేజ క్రాక్ వంటి సూపర్ హిట్ తర్వాత రెండు భారీ డిజాస్టర్స్ ఎదుర్కున్న విషయం తెలిసిందే.ఇప్పుడు ఆ డిజాస్టర్స్ కు బదులు తీర్చుకుంటున్నాడు.ఈ భారీ డిజాస్టర్స్ ను మరిపించే బ్లాక్ బస్టర్ హిట్ ను ధమాకా తో అందుకున్నాడు మాస్ రాజా.త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ రాబడుతూ దూసుకు పోతుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమా పెద్ద విజయం సాధించినందుకు హైదరాబాద్ జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ధమాకా మాస్ మీట్ ఏర్పాటు చేశారు.మరి ఈ మాస్ మీట్ లో రవితేజ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు.

ఈ సినిమా సక్సెస్ కు ముఖ్య కారణం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అని తాను ఇచ్చిన సాంగ్ లతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది అని తెలిపాడు.

త్రినాథరావు ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ ధమాకానే అని ఈ సినిమా డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టారని రాబోయే రోజుల్లో ఈయన డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేయాలని కోరుకుంటున్నారు.ఇక నిర్మాతలు కూడా ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు.నా సినిమాలను ఇంతగా ఆదరిస్తున్న తముళ్ళకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు.

రెండేళ్ల తర్వాత ధమాకాతో పండుగ వచ్చింది.ఇక నుండి ప్రతి ఏడాది మనకు పండుగలు రావాలని.

నన్ను ఇలాగె ఆదరించాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube