తక్కువలో మంచి స్మార్ట్ ఫోన్ కావాలా? ఇవి ట్రై చేయండి, రూ.7 వేల లోపే!

స్మార్ట్ ఫోన్ కావాలనే కోరిక ఎవరికుండదు? నేటి దైనందిత జీవితంలో స్మార్ట్ ఫోన్ అవసరం ఎంతైనా వుంది.అందుకనే ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఇది తప్పనిసరి అయిపోయింది.

 Want A Good Smart Phone For Less Try These, Under Rs.7 Thousand , Best Smartphon-TeluguStop.com

అయితే మార్కెట్లో మనకు అనేకరకాలైన స్మార్ట్ ఫోన్స్ బడ్జెట్ ధారాలలోనే దర్శనమిస్తాయి.అయితే సదరు ఇన్ఫర్మేషన్ మాత్రం ఎవరికీ అందుబాటులో ఉండదు.

అలాంటివారి కోసమే ఈ కధనం… ఎక్కువ రేటులో కాకుండా బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కోసం వెతికేవారికి శుభవార్త.ఆన్‌లైన్‌లో మీరు అనుకున్న రేటులోనే అదిరే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయొచ్చు.

ప్రముఖ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో ఇపుడు తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్స్ అమ్మకానికి వున్నాయి.7 వేల కన్నా తక్కువ ధరలో మీరు వాటిని కొనుక్కోవచ్చు.ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 6 ఫోన్ ఇపుడు బడ్జెట్ ధరలోనే లభిస్తోంది.ఈ ఫోన్ రేటు రూ.8,999 కాగా దానిని ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని రూ.6,499కే ఇపుడు సొంతం చేసుకోవచ్చు.అలాగే మైక్రోమ్యాక్స్ ఇన్ 2C ఫోన్ ధర రూ.9,499 కాగా రూ.5,999కే అందుబాటులో వుంది.బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కోరుకునే వారు వీటిని ట్రై చేయొచ్చు.

ఇంకా మరికొన్ని స్మార్ట్ ఫోన్స్ కూడా అందుబాటులో వున్నాయి.రెడ్‌మి 9ఏ స్పోర్ట్ స్మార్ట్‌ఫోన్ ఇపుడు రూ.6599కు అమ్మకానికి వుంది.అలాగే టెక్నో పాప్ 5 LET స్మార్ట్‌ఫోన్ కూడా అందుబాటు ధారాలలోనే వుంది.ఈ ఫోన్ MRP రూ.6499లకే లభిస్తోంది.అంతేకాకుండా, సదరు స్మార్ట్ ఫోన్స్ ని ఇంకా తక్కువ ధరలకు పొందవచ్చు.డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఆప్షన్స్ ని ఉపయోగిస్తే మరింత ధర తగ్గే అవకాశం కలదు.

స్టాక్ ఉన్నంత వరకే ఈ డీల్స్ లభిస్తాయని వినియోగదారులు గుర్తించుకోవాలి.అందువల్ల కొత్త ఏడాదికి మంచి ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్స్‌ను వాడుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube