'స్మార్ట్‌ విలేజ్‌' కల సాకారానికి ఆ యువ‌కుడు ఏం చేస్తున్నాడంటే...

గ్రామాల్లో అభివృద్ధి, శ్రేయస్సు కోసం ప్ర‌ముఖ స‌మాజ సేవ‌కుడు నానాజీ దేశ్‌ముఖ్ చేప‌ట్టిన ఉద్య‌మంతో అసంఖ్యాక యువత అనుబంధం కలిగి ఉంది.వారిలో ఒకరే యూపీలోని ఉన్నావ్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల అనురాగ్ త్రివేది.

 Young Man Doing To Realize The Dream Of 'smart Village' , , Smart Village , You-TeluguStop.com

అనురాగ్ తన అంకితభావం, కృషి, ప‌ట్టుద‌ల‌తో నానాజీ దేశ్‌ముఖ్ క‌లలుగ‌న్న‌ నూతన భారతదేశాన్ని స్మార్ట్ విలేజ్‌గా మార్చాలనే ఆలోచనను నిజం చేయడానికి నిరంత‌రం ప్రయత్నిస్తున్నాడు.రెండు సంవత్సరాల కాలంలో అనురాగ్ త్రివేది 10 వేల మందికి పైగా విద్యార్థులను దేశ‌ సర్వతోముఖాభివృద్ధిలో నిమగ్నమ‌య్యేలా చేశారు.

జిల్లాలోని పాద్రి కలాన్ గ్రామానికి చెందిన అనురాగ్ త్రివేది ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నారు.ఇందుకోసం ఢిల్లీకి వెళ్లిన అతనికి ఐఏఎస్ శిక్ష‌ణ‌లో కూడా ప్రత్యేకంగా ఏమీ చేయలేమ‌నిపించింది.

అనురాగ్ తాను ఐఎఎస్ కాలేక‌పోయినా కొంతమంది సహచరులతో కలిసి ఐఎఎస్‌ కోచింగ్ సెంట‌ర్‌ ప్రారంభించారు.ఇంతలో కరోనా కాలం క‌మ్ముకొచ్చింది.

లాక్‌డౌన్‌ కారణంగా చాలామందికి జీవనోపాధి స్తంభించింది.అటువంటి పరిస్థితిలో అనురాగ్ అత‌ని సహచరులు కలిసి, ప్రజలకు ఉచితంగా ఆహారం అందించే కార్యక్ర‌మాన్ని ప్రారంభించారు.

రెండున్నర నెలల్లో సుమారు 6 వేల మందికి భోజనం అందించారు.త‌మ‌ ఊరు అసౌక‌ర్యాల‌తో కొట్టుమిట్టాడుతున్న‌ద‌ని అనురాగ్ తెలిపారు.

గ్రామంలోని పరిస్థితి, అక్కడి పిల్లల భవిష్యత్తుపై అత‌నిలో ఆందోళన నెలకొంది.ముఖ్యంగా పల్లెటూరిలోని ఆడపిల్లను స్వావలంబన దిశ‌గా తీర్చిదిద్దాలనే తపన అత‌నిలో క‌లిగింది.ఫ‌లితంగా తన సొంత గ్రామంలోనే విద్య, స్వావలంబన, లింగ సమానత్వం, పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న ఉద్యమాన్ని ప్రారంభించాడు.ముందుగా గ్రామంలోనే గ్రంథాలయాన్ని ప్రారంభించారు.

అలాగే ప్రొజెక్టర్ సాయంతో పిల్లలకు చరిత్ర, జాగ్రఫీ, జనరల్ నాలెడ్జ్ గురించి బోధించ‌డం ప్రారంభించారు.అంతే కాకుండా జాతీయ ప‌ర్వ‌దినాన ఆరోగ్య కాంక్ష‌తో పిల్లలు ట్రాక్‌సూట్‌లు వేసుకుని పరుగులు తీసేలా చేశానని అనురాగ్ చెబుతున్నాడు.

Telugu Smart, Anurag Trivedi, Gramodaya, Nanaji Deshmukh, Unnao, Uttar Pradesh,

మొదట్లో ఇత‌రుల‌తో ప‌లు సమస్యలు త‌లెత్తినా ఆ తర్వాత జనం త‌న‌తో కలిసిపోవడం ప్రారంభించార‌న్నారు.అనురాగ్‌కు ఈ ఉద్య‌మంలో గ్రామపెద్దలు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు పిల్లల తల్లిదండ్రుల సహకారం కూడా లభించింది.ఫ‌లితంగా ప్ర‌స్తుతం అనురాగ్ ఏడు స‌మ‌గ్రాభివృద్ధి శిక్ష‌ణ‌ కేంద్రాలను నడుపుతున్నారు.వీటిలో సుమారు పది వేల మంది పిల్లల సర్వతోముఖాభివృద్ధి జరుగుతోంది.ఈ కేంద్రాల్లో చిన్నారుల‌ శారీరక, మానసిక వికాసం జరుగుతుతోంది.ఈ అమోఘ లక్ష్యాన్ని నెరవేర్చడానికి, అనురాగ్ 2020లో గ్రామోదయ సంస్థను స్థాపించారు.

నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అండ్‌ జీరో బడ్జెట్ ఫార్మింగ్ నిపుణుడు పద్మశ్రీ భరత్ భూషణ్ త్యాగి కూడా ఈ సంస్థతో అనుబంధం ఏర్ప‌రుచుకున్నారు.వీరు గ్రామ చిత్రపటాన్ని స‌మోన్న‌తంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube