ఎస్ జె సూర్య దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూమిక హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఖుషి.ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనందరికీ తెలిసిందే.
అయితే ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ధోరణి నడుస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను సందడి చేశాయి.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ భూమిక కాంబినేషన్లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది.
నూతన సంవత్సరం కానుకగా డిసెంబర్ 31వ తేదీ ఈ సినిమా పలు థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమాని మరోసారి థియేటర్లో చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ విడుదల చేయడంతో ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ విధంగా ఖుషి సినిమా రీ రిలీజ్ అవడంతో ఇందులో హీరోయిన్ గా నటించిన భూమిక ఈ సినిమా విడుదల విషయంపై స్పందించారు.

ప్రస్తుతం విదేశాలలో ఉన్నటువంటి భూమిక ఈ సినిమా రీ రిలీజ్ గురించి స్పందిస్తూ ఒక వీడియో చేశారు.ఈ సందర్భంగా భూమిక మాట్లాడుతూ ఖుషి వంటి బ్లాక్ బస్టర్ సినిమా తిరిగి విడుదల అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఇలాంటి అద్భుతమైన సినిమాలో నటించే అవకాశం కల్పించినటువంటి నిర్మాత ఏయం రత్నం గారికి, డైరెక్టర్ ఎస్ జె సూర్య, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అదే విధంగా న్యూ ఇయర్ లో ప్రతి ఒక్కరూ సంతోషంగా గడపండి అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.







