బీజేపీ.. టార్గెట్ 90 సాధ్యమేనా..?

తెలంగాణలో ఎలాగైనా అధికారం సాధించడానికి బీజేపీ వడిబడిగా పావులు కదుపుతోంది.ఎన్నికలు దగ్గర పడటంతో.

 Bjp Target 90 Is Possible Bjp , Brs , Bjp Joinings , Brs , Kcr , Etela Rajender-TeluguStop.com

అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.ఇక తెలంగాణ ఇంచార్జ్ నుంచి సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, బండి సంజయ్, ఈటల రాజేంద్ర మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

పార్టీలో చేరికలు వేగం పెంచాలని.వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం సాధించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు.

దాంతో బీజేపీ మరో సారి స్పీడ్ పెంచింది.పార్టీ బలహీనంగా ఉన్న చోట చేరికలపై ఫోకస్ పెట్టాలని.

అధిష్టానం ఆదేశించింది.

హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం చేరికలపై గ్రామస్థాయి నుంచి ఫోకస్ పెట్టారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్తులను లాగడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.అయితే అక్కడితో ఆగకుండా.

వచ్చే ఎన్నికల్లో కనీసం 90 స్థానాలు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నారు.దాని కోసం పార్టీకి కేడర్ లేని చోట.గట్టి లీడర్లను పార్టీలోకి ఆహ్వానించి.టిక్కెట్లపై హామీలు ఇవ్వాలని సైతం నేతలు నిర్ణయించారు.

బీజేపీకి కొన్ని ఏరియాల్లో కేడర్ కూడా లేకపోవడం మైనస్ గా మారింది.దానికి తోడు పాతబస్తీలోని ఎనిమిది నియోజకవర్గాలు, నిజామాబాద్, ఆదిలాబాద్ లలో ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి మైనస్ గా మారే అవకాశం ఉంది.

కమ్యూనిస్టులు బలంగా ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కూడా బీజేపీకి స్ట్రాంగ్ కేడర్ లేదు.రాష్ట్రంలోని మొత్తం 119 నియోజక వర్గాల్లో వాటిని మినహాయించి.

తక్కువలో తక్కవ 90 సీట్లను సాధించి అధికారం చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

Telugu Bjp, Etela Rajender, Khammam, Nalgonda, Narendra Modi, Ts-Political

ఇక సీఎం కేసీఆర్ కు పక్కలో బల్లెంలా ఉన్న లీడర్లను నయానో బయానో పార్టీలోకి తీసుకుని పోటీకి నిలబెట్టాలని చూస్తున్నారు తద్వారా బీజేపీ సింబల్ జనాల్లోకి సులభంగా చేరుతుంది.దానికి తోడు తెలంగాణాలో ఆర్ఎస్ఎస్ ఎప్పుడో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది.అది కూడా బీజేపీకి కలసి వస్తే.

సులభంగా 60 నుంచి 70 సీట్ల వరకూ సాధించ వచ్చని అంచనాలు వేస్తున్నారు.మరి నిజంగా బీజేపీ పెట్టకున్న టార్గెట్ 90 సాధిస్తుందా.? లేక కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేసి ఆ ప్లేస్ ను ఆక్రమిస్తుందా తేలాలంటే ఎన్నికలు రావాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube