తెలుగు సినిమాలు అంటే బాలీవుడ్ ప్రేక్షకులు కానీ హీరోలు కానీ ఇంతకు ముందు తక్కువ చేసి చూసే వారు.అలాగే అక్కడ స్టార్స్ మన సినిమాల్లో నటించడానికి కానీ.
వారి సినిమాలను ఇక్కడ ప్రోమోట్ చేయడానికి కానీ అంత ఆసక్తి చూపించేవారు కాదు.కానీ ఇప్పుడు అలా కాదు.
మన రేంజ్ మారిపోయింది.ఇంతకు ముందులా మన సినిమాలను చిన్న సినిమాలుగా కూడా చూడడం లేదు.
బాలీవుడ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా సౌత్ మార్కెట్ ఎదిగింది.అందుకే ఇక్కడి మార్కెట్ పై అక్కడి స్టార్స్ ఫోకస్ పెట్టి ఇక్కడ నటించడానికి కూడా వెనుకాడడం లేదు.
ఇక్కడ సౌత్ సినిమాల్లో ఆఫర్స్ వస్తే బాలీవుడ్ నటీమణులు నటించడానికి వెంటనే ఓకే చెబుతున్నారు.మరి ఈ నేపథ్యంలోనే 2022 ఏడాదిలో సౌత్ కు పరిచయం అయిన బాలీవుడ్ స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాతో సల్మాన్ ఖాన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమా తెలుగు ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించింది.

ట్రిపుల్ ఆర్ సినిమాతో అజయ్ దేవగన్ తో పాటు అలియా భట్ కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.వీరిద్దరూ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
ఇక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో మరో భామ కూడా ఉంది.పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో అనన్య పాండే ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఈమె ఆకట్టుకోలేక పోయింది.

కార్తికేయ 2 సినిమాతో అనుపమ్ ఖేర్ ఎంట్రీ ఇచ్చాడు.ఈయన నటనతో అదరగొట్టారు.ఈయన నటించడం వల్ల ఈ సినిమా బాలీవుడ్ లో మరింత హైప్ తెచ్చుకుంది.
ఇక కెజిఎఫ్ 2 ద్వారా సంజయ్ దత్ సౌత్ ఎంట్రీ ఇచ్చాడు.ఈ సినిమాలో విలన్ గా ఈయన అదరగొట్టాడు.అదే సినిమాలో రవీనా టాండన్ కూడా ఎంట్రీ ఇచ్చి నటనతో మెప్పించింది.

ఇక పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఐశ్వర్య రాయ్ చాలా రోజుల తర్వాత సౌత్ లో నటించింది.బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి అజిత్ కుమార్ వలిమై సినిమాతో మెప్పించింది.బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ కూడా సౌత్ ఎంట్రీ ఇచ్చాడు.
ఇలా సౌత్ సినిమాల మీద బాలీవుడ్ ఇండస్ట్రీ మోజు చూపిస్తుంది.







