మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ నటిస్తున్న ప్రాజెక్టుల్లో వాల్తేరు వీరయ్య ఒకటి.మల్టీ స్టారర్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో రవితేజ అదిరిపోయే నటన కనబరిచినట్టు ఇప్పటికే వచ్చిన టీజర్ తో అర్ధం అయ్యింది.
డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
చాలా రోజుల తర్వాత చిరు, రవితేజ కాంబోలో సినిమా రాబోతుండడంతో సంక్రాంతికి మెగా ఫ్యాన్స్ తో పాటు మాస్ రాజా ఫ్యాన్స్ కు కూడా పూనకాలు లోడింగ్ అని తెలుస్తుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.
నిన్న ఈ సినిమా యూనిట్ మొత్తం ప్రెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే.మరి ఈ ప్రెస్ మీట్ లో మెగాస్టార్ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసారు.
అయితే ప్రెస్ మీట్ లో మెగాస్టార్ రవితేజ గురించి మాట్లాడడం మర్చిపోవడంతో స్పెషల్ గా సోషల్ మీడియాలో వేదికగా పోస్ట్ చేసారు.

రవితేజపై మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలపై రవితేజ కూడా స్పందించారు.చిరు వ్యాఖ్యలపై ఆనందం వ్యక్తం చేస్తూ రిప్లై ఇచ్చారు.అన్నయ్య నీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది అని.మీ వ్యాఖ్యలు వల్ల మరింత ఆనందంగా ఉంది అని పోస్ట్ చేయడంతో.రవితేజ వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తున్నాయి.
ఇప్పుడు వీరిద్దరి పోస్ట్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.







