మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఈయన బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు.
గత కొద్ది రోజుల క్రితం గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి సంక్రాంతి కానుకగా వాల్తేరు వీరయ్య అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీ విడుదల కానుంది.
విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిరంజీవి ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా చిరంజీవితో పాటు రవితేజ కూడా పాల్గొన్నారు.అయితే విలేకరులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.
ఇక రవితేజ సైతం తాను ఇప్పుడేమీ మాట్లాడనని ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడతానని తెలిపారు.
ఇక ఈ సినిమా గురించి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.డైరెక్టర్ బాబి ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా చిత్రీకరించారని ఇక ఈ సినిమాలో నేను కూడా ఊహించని విధంగా నన్ను చూపించారని చిరంజీవి తెలియజేశారు.ఈ సినిమా చూసిన తర్వాత తప్పకుండా ఈ సినిమా డబల్ బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న కాన్ఫిడెంట్ నాలో ఉందని చిరంజీవి చేసినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరి వాల్తేరు వీరయ్య సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలా మెప్పిస్తారో తెలియాల్సి ఉంది.