దేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ “భారత్ జోడో” పాదయాత్ర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.జాతీయ రాజకీయాలలో రాహుల్ కీలకంగా రాణిస్తున్నారు.
రాహుల్ పాదయాత్రకి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు తెలుపుతున్నారు.ఇదే సమయంలో ప్రజల నుండి విపరీతమైన ఆదరణ లభిస్తుంది.
సినిమా సెలబ్రిటీలు సైతం రాహుల్ గాంధీతో కలిసి అడుగులు వేస్తున్నారు.దేశ సమైక్యత చాటే రీతిలో రాహుల్ ప్రసంగాలు ఉండటంతో చాలామంది ఆకర్షితులవుతున్నారు.
ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం కరోనా నిబంధనలు రాహుల్ గాంధీ పాదయాత్రకి విధించటంపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ పాదయాత్ర భయంతోనే మోడీ ప్రభుత్వం కరోనా నిబంధనలు తీసుకొచ్చిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
బీజేపీ కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు.ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ మండిపడ్డారు.
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తుందని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిధుల విషయంలో మోడీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
రాష్ట్రంలో ప్రజలు విపత్కర పరిస్థితిలు.ఎదుర్కొంటున్నారని.
రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.








