తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా రోజా సక్సెస్ అయ్యే విషయం తెలిసిందే.
సినిమాల ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకుని స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకున్న రోజా, బుల్లితెర షోలకు జడ్జిగా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.ఇది ఇలా ఉంటే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసిన రోజా రాజకీయాల్లో యాక్టివ్గా పాల్గొంటూ వైఎస్సార్సీపీ పార్టీ తరఫున పోటీ చేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవలే మంత్రి హోదాను కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే.
అయితే ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు జబర్దస్త్ షోలో పాల్గొన్న రోజా మంత్రి అవ్వడంతో బుల్లితెర కు గుడ్ బాయ్ చెప్పేసింది.సాధారణగా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వారు ఎన్నో రకాల ట్రోలింగ్స్ ను ఎదుర్కొంటూ ఉంటారు.
కానీ రోజా రాజకీయపరంగా సినిమా పరంగా రెండింటి పరంగా కూడా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్, నెగిటివ్ కామెంట్స్ ని ఫేస్ చేసింది.అయితే ట్రోలర్స్ రోజాతో ఆగకుండా ఆమె ఫ్యామిలీ పై కూడా దారుణంగా ట్రోలింగ్స్ చేశారు.
రోజా కూతురు అన్షు మాలిక కూడా ట్రోల్స్ ను ఫేస్ చేసిందట.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా మాట్లాడుతూ.సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తమ కూతురి ఫోటోలను మార్ఫింగ్ చేసి తన గురించి ఆసభ్యకరమైన పోస్టులు చేశారని, అది చూసి తన కుమార్తె చాలా బాధపడిందని రోజా తెలిపారు.

తన కూతురు చాలా సెన్సిటివ్ అని ఇలాంటివి తెలుసుకొని ఇలాంటివన్నీ మనకు అవసరమా అంటూ మొహం మీద తనని ప్రశ్నించింది అని చెప్పుకొచ్చింది రోజా.సమయంలో తన కూతుర్ని ఎలా ఫేస్ చేయాలో తనకు తెలియలేదనీ కానీ సెలబ్రిటీలకు ఇలాంటివన్నీ కామన్ గా జరుగుతుంటాయి.అవి పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేమంటూ తన పిల్లలక అర్థమయ్యేలా సర్థి చెప్పానని అని తెలిపారు.
ఇక ఇంటర్వ్యూలో భాగంగా రోజా ఎమోషనల్ గా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.