ట్విట్టర్ యూజర్లు, ఈ కొత్త ఫీచర్ గమనించారా?

ప్రస్తుతం మనకి అందుబాటులో వున్న ప్రముఖ సోషల్ మీడియాలలో ట్విట్టర్ ది చాలా ప్రత్యేకమైన స్థానం అని చెప్పుకోవాలి.ఎందుకంటే దీనిని సామాన్యులు ఎలాగైతే విరివిగా వినియోగిస్తారో… సెలిబ్రిటీలు కూడా అదేరీతిలో వినియోగిస్తారు.

 Twitter Users, Have You Noticed This New Feature ,twitter,twitter New Feature,ce-TeluguStop.com

అలా వాడబాటుతున్న మరో సోషల్ మీడియా దాదాపు లేదనే చెప్పుకోవాలి.అందుకే ట్విట్టర్ అంత పాపులర్ అయింది.

ఇకపోతే వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు ట్విట్టర్ కొత్త CEO ఎలన్ మస్క్ ప్రకటించాడు.

ఇంతకుముంది ట్వీట్ ని ఎంతమంది లైక్ చేసారు, ఎంతమంది షేర్ చేశారు, ఎన్ని కామెంట్స్ వచ్చాయనే విషయాలు తెలిసేవి.

కానీ ఎంత మంది ట్వీట్ ను చూశారన్న లెక్క మాత్రం తెలిసేది కాదు.అయితే, ఇకపై ఆ సంఖ్యను చూపించేలా ట్విట్టర్ లో కొత్త ఫీచర్ ప్రవేశ పెట్టారు.

లైక్, షేర్, కామెంట్స్ ఐకాన్స్ పక్కనే వ్యూస్ సింబల్ ఇకనుండి మీకు కనబడనుంది.కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే ట్వీట్ ను ఎంతమంది చూశారు, ఎంత మందికి సమాచారం రీచ్ అయిందన్న విషయాలు చాలా తేలికగా తెలుస్తాయి.

ఇక ఈ వ్యూస్ సింబర్ వలన లైక్, షేర్, కామెంట్స్ తక్కువ ఉన్నప్పటికీ వ్యూస్ కౌంట్ అనేది వినియోగదారుడికి ఉపశమనాన్ని కలిగిస్తుంది.వ్యూస్ అప్డేట్ అనేది ట్విట్టర్ కి కొత్త కావచ్చు గాని, మిగిలిన సోషల్ మీడియాలు అయినటువంటి యుట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టాలకు కొత్తకాదు.కాబట్టి తాజాగా అప్డేట్ అయిన ఈ ఫీచర్ ఓ సాధారణ యూజర్ నుండి సెలిబ్రిటీల వరకు ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube