చాలా మంది చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు.అలాంటి వారి జీవితం లో ఏదైనా చెడు సంఘటన జరిగితే వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు.
ఇక వారు ఆ డిప్రెషన్ నుంచి బయటకి రావడానికి ఎంతకాలం పడుతుందో ఎవరికీ తెలియదు.అలా డిప్రెషన్లో ఉన్న వారికి సహాయపడటం కోసం మేమున్నాం అని భరోసా ఇచ్చే వారు పక్కన ఉంటే డిప్రెషన్ నుంచి తొందరగా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలా కాకుండా తమ సొంతవాలె ఇంకా బాధపెడితే డిప్రెషన్ లో ఉన్న వ్యక్తి చనిపోయే ప్రమాదం కూడా ఉంది.అయితే ఇక్కడ ఒక్క అమ్మాయి ఏదో విషయం లో బాధపడుతుంది.
ఇక ఇంట్లో ఉండలేక ఆరుబయట వరండాలోకి వచ్చి వర్షంలో నేలపై పడుకుని బాధపడుతుంది.ఆ సమయంలోనే వచ్చిన ఆ అమ్మాయి తల్లి వెంటనే కార్ దిగి కూతురిని మందలించకుండా తన కూతురు పక్కనే వర్షంలో తడుస్తూ పడుకుంది.
ఆమె తన కూతురి ఆందోళన తీరేంత వరకు అలా వర్షంలో తడుస్తూ కూతురికి తోడుగా ఉంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ తల్లి స్వచ్ఛమైనా ప్రేమకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ వీడియోకు ఇప్పటికే 34 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.“ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఆందోళనలతో సతమతమవుతున్నారు.ఈ బాలిక ఇంటి ముందు, వాకిలిపై పడుకుని, వర్షంలో తడిచేంత బాధల్లో ఉందంటే చాలా షాకింగ్‌గా అనిపిస్తోంది.ఇలాంటి విషయాలను సీరియన్‌గా తీసుకోవాలి.” అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.దానికి ప్రతిస్పందనగా నేలపై పడుకుని వర్షంలో తడవడం ద్వారా చాలా వరకు ఆందోళన తగ్గించుకోవచ్చని ఒక వ్యక్తి పేర్కొన్నాడు.