భారతదేశం సర్వ సంప్రదాయాలకు నిలయం.అందులో ఆహారం అనేది భారతీయ సంస్కృతిలోనే అంతర్భాగమైంది.
తాజాగా ఆహారం విషయంలో ప్రేక్షకుల నుంచి ఆన్ లైన్ల సర్వేలు చేపట్టారు.ఈ సర్వే ప్రకారం 2022కి ప్రపంచంలోని అగ్రశ్రేణి వంటకాల్లో భారతదేశం 5వ స్థానంలో నిలిచి అందరికీ ఆశ్చర్యపరిచింది.
మనదగ్గర భోజన ప్రియులు ఎక్కువ.ఈ క్రమంలోనే రకరకాల ఆహార పదార్ధాలు ఇక్కడ పుట్టుకొచ్చాయి.
అంతేకాకుండా మన మసాలాలకు దేశంలోనే కాకుండా ప్రపంచం అంతా ప్రేమికులు ఉన్నారు.
మనదేశానికి వచ్చిన చాలామంది ప్రత్యేతకులు ముందుగా ఇక్కడ భోజనాన్ని రుచి చూడటానికి ఇష్టపడుతారు.
‘భారతీయ వంటకాలు’ అనే పేరు వింటే చాలామందికి నోట్లో నీళ్లూరుతాయి.టేస్ట్ అట్లాస్ అవార్డ్స్ ద్వారా 2022లో ప్రపంచంలోనే 5వ అత్యుత్తమ వంటకాలను కలిగి ఉన్న దేశంగా భారతదేశం రికార్డులకెక్కింది.
టాప్ ర్యాంకును ఇటలీ సొంతం చేసుకోగా గ్రీస్ 2వ స్థానంలో ఉండటం గమనార్హం.ఆ తరువాత స్పెయిన్, జపాన్ మూడు నాల్గవ స్థానాలు ఆక్రమించాయి.

భారతదేశం ఉత్పత్తి చేసిన 411 వంటకాల్లో రోటీ, చట్నీ, నాన్, బటర్ గార్లిక్ నాన్, తందూరీ, కీమా, షాహీ పన్నీర్, పన్నీర్ టిక్కా, మలై కోఫ్తా స్థానాన్ని సంపాదించాయి.ఈ లిస్టులో బటర్ చికెన్ కూడా వుంది.అలాగే పరాఠా, రసగుల్లా, మసాలా, పూరీ, దోశ, కాజు కత్లీ అందరూ మెచ్చిన వంటకాల లిస్ట్ లో ఉన్నాయి.ఇవి మాత్రమే కాకుండా మసాలా ఛాయ్, మ్యాంగో లస్సీ, లస్సీ, జిన్, స్వీట్ లస్సీ, సౌత్ ఇండియన్ కాఫీ, అస్సాం టీ, గాజర్ కా దూద్, హల్డీ దూద్, ఠండాయి, వంటి అత్యుత్తమ రేటింగ్ పొందిన భారతీయ పానీయాలు కూడా వున్నాయి.
ఈవెనింగ్ స్నాక్స్ విషయానికొస్తే సమోసా, పానీ పూరీ, పకోరా, పాపడ్, పాప్రీ చాట్, మేడు వడ, ఆలూ టిక్కీ, మురుక్కు, ఢోక్లా, దాబేలీ.ఇతర స్నాక్స్ కూడా ఉన్నాయి.







