వైరల్: పెళ్లివేడుకలో దుమ్ములేపిన వధువు... మురిసిపోయిన తండ్రి!

సోషల్‌ మీడియా నేడు అన్ని మీడియాలని డామినేట్ చేస్తోంది.ఈ క్రమంలో టీవీలు చూసే వారి సంఖ్య తగ్గిపోయింది అంటే నమ్మశక్యం కాదు.

 Viral: The Bride Who Raised Dust In The Wedding Ceremony The Father Is Upset , B-TeluguStop.com

ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ రోజుకి కొన్ని లక్షల సంఖ్యలో వివిధ దేశాల, ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు దర్శనం ఇస్తాయి.అయితే అందులో ఏ కొన్నో వైరల్ అవుతూ ఉంటాయి.

ఇక ఈ మధ్య కాలంలో చూసుకుంటే పెళ్లి వేడుకలకు సంబంధించినటువంటి వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూడవచ్చు.మన ఇండియాలో మరీ ముఖ్యంగా హిందువులు వివాహ వేడుకలను ఎంత ప్రత్యేకంగా జరుపుకుంటారో చెప్పాల్సిన పనిలేదు.

కొన్ని సార్లు వైరల్ అయ్యే వీడియోల వలన సదరు పెళ్లి కూతుళ్లు రాత్రికి రాత్రే ఒక్కరోజు ముఖ్యమంత్రిలాగా సెలిబ్రిటీలు అయిపోయే ఘటనలు మనం చూసాం.ఉదాహరణకు కొన్నాళ్ల క్రితం ‘బులెట్ బండి’ పాటకు స్టెప్పులేసి ఓ వధువుని కొన్ని మీడియాలు ఇంటర్వ్యూ చేసిన ఘటనలు చూసాం.

ఇక ఇదే కోవలోనే తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.అవును, ట్విటర్‌లో ఓ నవవధువు వీడియో తెగ వైరల్ అవుతోంది.తన పెళ్లిలో తానే సంప్రదాయ వాయిద్యాన్ని వాయిస్తూ సందడి చేసింది.

ఆ తంతుని చూసి తన తండ్రి ఆనందంతో పొంగిపోయాడు.

సోమవారం త్రిస్సూర్‌ జిల్లా గురువాయూర్‌ ఆలయంలో ఒక వివాహం జరగగా వధువు తండ్రి కేరళ సంప్రదాయ వాయిద్యం చెండా మాస్టర్‌ కావడంతో ఓ గ్రూప్ ని అక్కడ ఉంచాడు.పొన్నన్స్‌ బ్లూ పేరుతో ఒక మ్యూజిక్‌ ట్రూప్‌ అతను నడుపుతున్నారు.

దీంతో.తన కూతురి పెళ్లికి ఆయన నేతృత్వంలోనే కార్యక్రమం జరిగింది.

తండ్రి డ్రమ్స్‌ వాయిస్తుంటే.కూతురు కూడా ఓ పక్క దుమ్ములేపడం చూపవచ్చు.

ఇక పెళ్లి కూతురి హుషారు చూసి పెళ్లి కొడుకు కూడా రంగంలోకి దిగాడు.సదరు వీడియోని చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube