అవకాశాలు లేకపోతే ఏంటి యూట్యూబ్ ఉందిగా మారుతున్న సెలబ్రిటీల తీరు

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఆ యూట్యూబ్ లో సెలబ్రిటీస్ హడావిడి మామూలుగా ఉండడం లేదు.వారి నిత్య జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.

 Telugu Youtube Stars Turns Youtubers Details, Telugu Youtube Stars ,youtubers, C-TeluguStop.com

తెల్లవారి లేచింది మొదలు పడుకునేంతవరకు ప్రతి విషయాన్ని డబ్బు కోణం లోనే చూస్తున్నారు.సినిమాల్లో అవకాశాలు ఉన్నారు లేకపోయినా, బుల్లితెరపై సీరియల్స్ నటించిన నటించక పోయిన యూట్యూబ్ ఉందిలే అనే విధంగా సెలబ్రిటీస్ మనస్తత్వం మారిపోతోంది.

అందుకు అనేక కారణాలు ఉన్నాయి యూట్యూబ్లో డబ్బులు దండిగా వస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవాలి అనేది వారి ఉద్దేశం.

సినిమాల్లో లేదా సీరియల్స్ లో నటిస్తే లక్షల్లో వస్తుంది కదా యూట్యూబ్ లో ఏం వస్తుంది అని అనుకోకూడదు.

ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ ప్రపంచం పూర్తిగా మారిపోయింది.ప్రతి వీడియోలో ఏదో ఒక రకంగా బ్రాండ్స్ దర్శనమిస్తున్నాయి.ఒకప్పుడు బ్రాండ్ ని ప్రమోట్ చేయడం అనేది తలకు మించిన బాధ్యత.టీవీలో ప్రకటనలు , పేపర్లలో యాడ్స్ హోర్డింగ్స్ వంటి వాటితో లక్షల్లో ఖర్చు చేసిన వాటి ఫలితం మామూలుగానే ఉండేది.

కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఒక చిన్న ఆడ్ ఇస్తే చాలు యూట్యూబ్ ఛానల్లో లక్షల వ్యూస్ వస్తున్నాయి.దాంతో పాటు బలవంతంగా ఈ బ్రాండ్ ప్రమోషన్ కూడా బాగానే వర్కౌట్ అవుతుంది.

Telugu Serial Actors, Teluguyoutube, Tollywood, Youtube, Youtubers-Movie

అందుకే ప్రతి ఒక్కరూ డిజిటల్ మీడియా వైపే ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.వారి వ్యాపార ప్రకటనలకు ఇప్పుడు యూట్యూబ్ అతిపెద్ద వేదికగా మారింది.స్మార్ట్ స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని ఇలా డిజిటల్ రంగం అభివృద్ధి చెందడం గత రెండు మూడేళ్లుగా బాగా కనిపిస్తుంది.రానున్న కాలంలో ఇది మరింత విస్తరించడం ఖాయంగా కనిపిస్తుంది.

కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు సామాన్యులకు కూడా యూట్యూబ్ ఒక వరంగా మారింది.  ఒకప్పుడు సెలబ్రిటీస్ మాత్రమే యూట్యూబ్ వాడేవారు.

కానీ ఇప్పుడు యూట్యూబ్ లో డబ్బులు సంపాదిస్తున్న చాలా మంది సెలబ్రిటీలు అవుతున్నారు.స్టార్ ఆర్టిస్ట్ నుంచి, ఫెడ్ ఔట్ అవుతున్న ప్రతి ఒక్కరూ ఇదే పని చేస్తున్నారు.

పైగా తమ ముద్దులొలికే చిన్న పిల్లలు, ప్రెగ్నెన్సీ లో ఉన్న వారు, ఇల్లు కడుతున్న యూట్యూబ్ విడియో లు పెట్టు బాగానే సంపాదిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube