తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బిగ్ బాస్ షో కి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే.
తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారమవుతున్నప్పటికీ తెలుగులో భారీగా ప్రేక్షకాధరణను దక్కించుకుంది.ఇప్పటికే తెలుగులో 6 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.
అలాగే బిగ్ బాస్ ఓటీటీ ని కూడా పూర్తి చేసుకుంది.ఇటీవల తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6 షో ముగిసిన విషయం తెలిసిందే.
బిగ్బాస్ షో ద్వారా చాలామంది భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు.మరి కొంతమంది నెగెటివిటిని మూట గట్టుకున్నారు.
ఇక తాజాగా బిగ్ బాస్ జోడి అనే షోని మొదలు పెట్టిన విషయం తెలిసిందే.బీబీ జోడీ లాంచ్ ప్రోగ్రామ్ కి హీరో నాగార్జున హాజరైన విషయం తెలిసిందే.
ఇక హోస్టు శ్రీముఖి నాగార్జున ని ఒక రేంజ్ లో పొగుడుతూ ఆయనకు గ్రాండ్గా వెల్కం చెప్పింది.నాగార్జున ఎంట్రీ ఇవ్వగానే విక్కీ దాదా అంటూ రాధా కూర్చొని ఒక చిన్న చెప్పు వేసింది.
ఆ మాటకి నవ్వుకున్న నాగార్జున,నాకు బాగా గుర్తు ఆమెతో ఆ డాన్స్ చేసేటప్పుడు భయపడే వాడిని అని నాగార్జున అనగా నిజంగానా అని రాధ అడగడంతో అవునండి నా టెన్షన్ మీకు తెలియదు అప్పుడే కొత్త కొత్తగా వచ్చాము మేము అని నాగార్జున తెలిపాడు.అప్పుడు రాధ ఆ సినిమా మొత్తంలో మీరు నాతో ఎక్కువగా మాట్లాడిందే లేదు అని కాస్త ఫీలవుతున్నట్టుగా చెప్పడంతో నాగార్జున ఎక్స్ప్రెషన్స్ ని మార్చేశాడు.
ఆ తర్వాత అందరూ షాక్ అయ్యి అడగగా బీబీ జోడి కంటెస్టెంట్స్ వైపు నాగార్జున చూడడంతో వెంటనే హీరోయిన్ తేజస్వి మదివాడ నాగార్జునకు వేలు చూపిస్తూ ఆ అని సరదాగా అనడంతో నాగార్జున రాధా ఇద్దరు కలిసి వేలు చూపిస్తూ డాన్స్ చేశారు.కాగా ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక నాగార్జునతో కలిసి చాలాకాలం తర్వాత రెండు మూడు స్టెప్పులు వేసిన రాధ అనంతరం నాగ్ కి హగ్గు కూడా ఇచ్చింది.అప్పుడు కంటెస్టెంట్స్ అందరూ కలిసి నాగార్జున రాధాలతో కలిసి స్టెప్పులు వేశారు.