తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేలా పచ్చగా ఉంటాయి.
ఇక టీడీపీ నుంచి రేవంత్ అరంగేట్రం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలయింది.వలస బ్యాచ్.
ఓన్ బ్యాచ్ అంటూ గ్రూపులు స్టార్ట్ అయ్యాయి ఏంతో కాలం నుంచి ఈ గ్రూప్ వార్ నడుస్తున్నా.ఎప్పుడు బయటకు పొక్కలేదు.
ఇక కమిటీల లొల్లి స్టార్ అయిన దగ్గరి నుంచి ముసలం బయటపడింది.అంతేనా.
ఏకంగా భట్టి లాంటి నేత మీటింగ్ పెట్టి మరీ తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు.
సీఎల్పీ లీడర్ భట్టితో పాటు మహా మహులు ఏకం కావడంతో.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సైతం గొంతు కలిపారు.దాంతో లొల్లి మరింత ముదిరింది.
ఏకంగా అధిష్టానం కదిలి.కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ ను రాయబారానికి పంపారు.
ఇక అమాత్యుడు వచ్చినా.అంతర్గత కొట్లాట మాత్రం సమసిపోలేదు.
ఆయన ముందే జిల్లాల నేతలు సిగపట్లు పట్టారు.దాంతో ఆయన సీరియస్ అయ్యారు కూడా.
ఇక మరోవైపు సీనియర్లు.అటు పార్టీ అద్యక్షుడు రేవంత్ రెడ్డిపైనా.
పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ పైనా.బాగానే ఫిర్యాదు చేశారు.
అందరి వాదనలు విన్న.దిగ్విజయ్ సింగ్ ఢిల్లీ పయనమయ్యారు.అయితే ఆయన ఢిల్లీ వెళ్లిన దగ్గరి నుంచి తెలంగాణ గల్లీల్లో ఒక కొత్త వాదన షురూ అయింది.త్వరలో అధిష్టానం నుంచి సీనియర్ నేతలకు తీపి కబురు రాబోతోందని.
రేవంత్ ను పార్టీలో క్రియా శీలకంగా ఉంచుతూనే.వేరే భాద్యతలు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది.
అంతే కాకుండా.మాణిక్యం ఠాకూర్ ను తప్పించి వేరొకరికి బాధ్యతలు ఇచ్చే చాన్స్ ఉందని సైతం తెలుస్తోంది.
మరి అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని భట్టి తమ ఆలోచనలు ఉంటాయని.సీనియర్లు తెగేసి చెప్పడంతో.
అధిష్టానం కూడా వారికి సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తోంది.మరి రేవంత్ ను కొనసాగిస్తారా లేక పదవి పొగపెడతారా చూడాలి.