ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఇపుడు ఎవరికీ అవసరం లేదు.ప్రస్తుతం మనకి అందుబాటులో వున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్‌స్టాగ్రామ్ నెంబర్ వన్ పొజిషన్లో వుంది అనడంలో అతిశయోక్తి లేదు.
ఎన్నో సర్వేలు అదే మాట నొక్కివక్కాణించి చెబుతున్నాయి.ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌కు మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు అనేది నగ్న సత్యం.
ఇక ఈ ప్లాట్‌ఫారమ్ ఫోటోలు, పోస్ట్‌లను షేర్ చేయడానికి, అలాగే స్టోరీలను క్రియేట్ చేయడానికి, రీల్స్ చేయడానికి జనాలు విరివిగా వాడుతున్నారనే విషయం కూడా తెలిసినదే.
ఈ క్రమంలో ఎప్పుడైనా మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కొంత కంటెంట్ అంటే ఫోటోగాని, వీడియోగాని, రీల్‌ని డిలీట్ చేసి, తిరిగి పొందాలని అనుకున్నారా? తెలియదులే అని వూరుకున్నారా? లేదులేదు పొరపాటున మీరు డిలీట్ చేసిన వాటిని తిరిగి పొందే అవకాశం కలదు.ఎలాగంటే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో డిలీట్ చేసిన కంటెంట్ అకౌంట్ నుంచి వెంటనే మాయమవుతుంది.కానీ ఆ కంటెంట్ రీసెంట్లీ డిలీటెడ్ ఫోల్డర్‌కు బదిలీ అవుతుందని మర్చిపోవద్దు.ఆ ఫోల్డర్‌లో డిలీట్ చేసిన డేటా 30 రోజుల వరకు స్టోర్ అవుతుంది.

ఇంకేముంది డిలీట్ చేసినవి స్టోరీస్ ఆర్కైవ్‌లో ఉంటాయి కనుక మరలా వాటిని పొందవచ్చు.సదరు ఫోల్డర్లోకి వెళ్లి రిస్టోర్ ఆప్షన్ కొడితే సరిపోతుంది.మరలా సదరు కంటెంట్ మీ ఫోన్లో ప్రత్యక్షమౌతుంది.
కాబట్టి ఈ ఆప్షన్ అనేది ఆపత్కాలంలో పనికి వస్తుంది.కాబట్టి తెలియని వారికి ఈ విషయాన్ని తెలియజేయండి.
ఇకపోతే ఒక్క మన భారతదేశంలోనే ఒక్క నిముషానికి కొన్ని లక్షలమంది ఈ ఇన్స్టాని ఏకకాలంలో ట్యాప్ చేస్తున్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి.ఇక దీని ద్వారా మన ఇండియాలో అనేకమంది ధనాన్ని ఆర్జిస్తున్నారు.







