వివాహం అనేది భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో ప్రధానమైన అంశం.ఇక్కడ ప్రతి ఒక్కరు తమ తమ వివాహ వేడుకను చాలా కనుల పండుగగా జరుపుకుంటారు.
ఇక వివాహ సమయంలో అమ్మాయి తరుపువారు అంటే పెళ్లికూతురు తల్లితండ్రులు లాంఛనప్రాయంగా కట్నకానుకలు పెళ్లి కొడుక్కి సమర్పించుకుంటారు.ఇది అనాదిగా వస్తున్న ఆచారం.
ఈ విషయంలో కొందరు తమ పరిధిని బట్టి, మరికొందరు తమ పరిధిని దాటి మరీ కట్నకానుకలను వరుడికి సమర్పించుకుంటారు.
ఈ క్రమంలోనే ఓ మామ తన అల్లుడికి ఇచ్చిన కానుక విషయం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అవును, ఎవరైనా తమ కుమార్తెకి వివాహం చేస్తే.బైక్, లేదా కారునే గిఫ్ట్ గా ఇవ్వడం మనం చూసాం.అయితే తాజాగా ఒక వ్యక్తి తమ కుమార్తె వివాహంలో అల్లుడికి ఒక బుల్‌డోజర్ గిఫ్ట్ గా ఇచ్చి స్థానికంగా సంచలం సృష్టించాడు.వివరాలు చూస్తే… హమీర్‌పూర్ జిల్లా, సుమెర్‌పూర్ పరిధిలోని దేవ్‌గావ్‌లో నివసిస్తున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి పరశురామ్ ప్రజాపతి, తన కుమార్తె నేహాకు నేవీలో పనిచేస్తున్న యోగేంద్రతో వివాహం జరిపించడానికి నిశ్చయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో వారి వివాహం ఈ నెల 15న చాలా హాట్టహాసంగా జరిగింది.కాగా పెళ్లి జరిగిన తరువాత వధువు తండ్రి కుమార్తెకు కట్నంగా బుల్డోజర్ ను అందించాడు.కాగా బుల్‌డోజర్‌ను గిఫ్ట్ గా ఇవ్వాలనే ఆలోచన చాలా మందికి కొత్తగా అనిపించింది.ఎందుకంటే గతంలో ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రాలేదనే చెప్పాలి.తన అల్లుడికి కారుని కట్నంగా ఇస్తే అది ఇంటి ముందు పడి ఉంటుంది.కానీ బుల్‌డోజర్ అయితే ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అనే ఆలోచనతో ఈ గిఫ్ట్ అందించానని ఆ పెద్దమనిషి స్థానిక మీడియాతో చెప్పాడట.
ఐడియా అదుర్స్ కదూ.మీరు కూడా ట్రై చేయండి మరి.







