ప్రస్తుతం బెలుగా తిమింగలానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో తిమింగలం ఒక బంతిని తన నోటి వద్దకు తెచ్చుకునేందుకు ప్రయత్నించిన విధానం ఇంటర్నెట్‌లో చాలామందిని ఆకట్టుకుంటుంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో నీటిలో ఉన్న తిమింగలం గోడపై ఉన్న బంతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది.కానీ ఆ బంతి చాలా దూరంగా ఉండటంతో తిమింగలం నోటితో నీళ్లు తీసుకొని బాల్ ఉన్న వైపు ఉమ్మివేయడం మనం గమనించవచ్చు.
నీటిని అంత ఫోర్స్ తో ఉమ్మివేసినా కూడా బంతి దగ్గరకి రాకపోవడంతో, మళ్ళీ ఒకసారి నీటిలోని వెళ్లి తన నోటి నిండా నీటిని నింపుకొని పైకి పోసింది.కానీ అప్పటికే బంతి చిన్నగా తిమింగలం దగ్గరకి రావడంతో దానికి వెంటనే దాని నోట్లో ఉన్న నీరు అవసరం లేదని అర్థం చేసుకుంది.
అలా దగ్గరకు వచ్చిన బంతిని తన నోటితో పట్టుకొని ఈదుకుంటూ వెళ్తుంది.ఈ వీడియోని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ఫ్యాసినేటింగ్ అకౌంట్ ద్వారా షేర్ చేసారు.
నిజానికి తిమింగలాల స్వభావం ఎంతో స్నేహపూరితంగా ఉంటుంది.ఈ తిమింగాలాలకు లేదా తెల్ల తిమింగాలాలను ట్రైన్ చేయడానికి రకరకాల విజిల్ సౌండ్స్ ని ఉపయోగిస్తారు.
ఇక ఆ సౌండ్స్ ని అనుగుణంగా తిమింగాళాలు ప్రవర్తిస్తాయి.ఈ 20 సెకన్స్ ఉన్న వీడియోని 4.7 మిలియన్ వ్యూస్ రాగా, లక్ష లైక్స్ వచ్చాయి.ఈ వీడియోకి ‘ఈ బెలుగా తిమింగలం తన తెలివి ఉపయోగించి బంతిని ఎలా సాధించగలిగింది ‘ అనే క్యాప్షన్ పెట్టి షేర్ చేశారు.
ఈ వీడియోకి ట్విట్టర్‌లో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.

‘ఒక్క బెలుగా తిమింగలం మెదడు మనిషి మెదడు కంటే రెట్టింపుగా ఉంటుంది.దాని మెదడు సమస్య పరిష్కారం కోసం ఎంతో చురుకుగా ఆలోచించగలదు’ అని ఒక్క వినియోగదారుడు కామెంట్ చేశాడు.ఇక మరికొంతమంది వినియోగదారులు కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు.
అసలు తిమింగాలన్ని ఎందుకు ట్యాంక్ లో ఉంచారు అని కొంతమంది ప్రశ్నిస్తుంటే మరికొంతమందేమో వాటిని సముద్రంలో విడిచిపెట్టమని సలహాలు ఇస్తున్నారు.







