ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలకే పెద్ద పెద్ద గొడవలు జరగడం సాధారణంగా మారిపోయింది.చిన్న మాట కు వాగ్వాదానికి దిగడం అనేది భార్యాభర్తలిద్దరికీ ఒక అలవాటుగా మారిపోయింది.
ఆ తర్వాత సర్దుకుని మామూలుగా ఉండడం ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయం.కొన్ని తప్పులను చూసి చూడనట్లు సరేలే అనుకుని కొంతమంది భార్య భర్తలు వదిలేస్తుంటారు.
కానీ ఒక మహిళ మాత్రం తన భర్త ఫోన్లో ఫోటోలను చూసి ఊరికే వదిలేయలేదు.తన భర్తను ఏర్పోర్ట్ లో అందరి ముందే చితక్కొట్టింది.
చుట్టుపక్కల వాళ్ళు, పోలీసులు వచ్చి ఎంత విడిపించినా భర్తను మాత్రం అస్సలు వదిలిపెట్టలేదు.ఆమె కోపానికి కారణం ఏంటి.
ఇంతకీ ఫోన్లో ఆమె ఏమి చూసింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలోని సౌత్ కరోలీనాలోని విమానాశ్రయంలో భార్యాభర్తలిద్దరూ క్రిస్మస్ పార్టీ కోసం పక్క రాష్ట్రానికి వెళ్తున్నారు.తన భర్తను ఫోన్ ఇవ్వాలని ఆమె అడిగి తీసుకుని లాక్ తీసి గ్యాలరీ ఓపెన్ చేసిన ఆమె షాక్కు గురైంది.భర్త ఫోన్ లో ఇతర మహిళల అసభ్యకర ఫోటోలను చూసి కోపంతో ఊగిపోయింది.
దీంతో భర్తను ఏ వస్తువు దొరికిన ఆ వస్తువుతో కొట్టడం మొదలుపెట్టింది.ముందుగా ఆ తర్వాత ఫోన్ ని తీసుకొని మరోసారి నేలకు కొట్టింది.
భార్యాభర్తల మధ్య మొదలైన చిన్నపాటి గొడవ ఎప్పుడూ ఘర్షణగా మారిపోయిందో అక్కడ ఉన్న ప్రజలకు అసలు అర్థం కాలేదు.గొడవను చూసిన భద్రతా సిబ్బంది వారిని విడదీయాలని ఎంత ప్రయత్నించినా వారికి సాధ్యం కాలేదు.
ఆమె మాత్రం ఆమె భర్తను అస్సలు వదలకుండా ఈడ్చి ఈడ్చి మరికొట్టింది.కాసేపటి తర్వాత ఆ పోలీసులు అక్కడికి చేరుకొని మహిళను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం భర్త కోరిక మేరకు ఆమెను వదిలిపెట్టారు.అక్కడ భర్తకు సూచనలు ఇవ్వడంతో విడుదల చేశారు.
మరోసారి తన భర్తతో అలా ప్రవర్తించనని కోర్టులో హామీ కూడా ఇచ్చింది.అయితే ఈ కేసుకు సంబంధించి వచ్చే ఏడాది ఫిబ్రవరి 15న ఆమె కోర్టుకి హాజరవాల్సి ఉంది.








