తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి చలపతిరావు ఆదివారం గుండెపోటు సమస్యతో మరణించారు.ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేశారు.
గూడచారి 116 సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన చలపతిరావు తన ఐదున్నర దశాబ్దాల కాలంలో సుమారు 1200 కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు.ఈయన నటుడుగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించి నష్టాలను ఎదుర్కొన్నారని తెలుస్తోంది.
ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటించిన చలపతి వయసు పైబడటంతో గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.అయితే ఈయన ఆదివారం గుండెపోటు సమస్యతో మరణించారు.ఇక చలపతిరావు మరణించడంతో సినీ సెలబ్రిటీలు మొత్తం తరలివచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.ఇక ఎంతో మంది సెలబ్రిటీలు చలపతిరావుతో వారికి ఉన్నటువంటి అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు.
ఇలా దాదాపు ఐదున్నర దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీలో ఉన్నటువంటి చలపతిరావు ఎంత మొత్తంలో ఆస్తులు సంపాదించారనే విషయం గురించి కూడా తెలుసుకోవడానికి ఆసక్తి చూపెడుతున్నారు.

చలపతిరావు ఇండస్ట్రీలో సుమారు 1200 సినిమాలలో నటించిన ఈయన పెద్దగా ఆస్తులను పోగు చేయలేదని తెలుస్తుంది.ఇండస్ట్రీలో కష్టపడుతూ తన పిల్లలను ఉన్నత స్థానంలో ఉంచారని, తన పేరు మీద కేవలం 20 కోట్లు విలువ చేసే ఆస్తులు మాత్రమే ఉన్నట్టు ఇండస్ట్రీ సమాచారం.హైదరాబాదులో పలు ప్రాంతాలలో ఈయనకు ఇల్లు మాత్రమే ఉన్నాయని వీటి విలువ 20 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
ఇక ఈయన ఇద్దరు కుమార్తెలు కూడా అమెరికాలో స్థిరపడ్డారు.ఇక కుమారుడు రవిబాబు ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా స్థిరపడ్డారు.







