మెగాస్టార్ చిరంజీవి వయస్సు 67 సంవత్సరాలు అయినా ఆయన నిజ జీవితంలో ఎంతో ఎనర్జీతో కనిపిస్తారనే సంగతి తెలిసిందే.ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలతో బిజీ అవుతున్న చిరంజీవికి కొన్ని సినిమాలతో సక్సెస్ దక్కుతుంటే మరికొన్ని సినిమాలతో చేదు ఫలితాలు ఎదురవుతున్నాయి.
అయితే చిరంజీవి మాత్రం డైలాగ్స్ విషయంలో కానీ డ్యాన్స్ విషయంలో కానీ ఇతర హీరోలతో పోల్చి చూస్తే ఒక మెట్టు పైనే ఉన్నారు.
తాజాగా చిరంజీవి మరింత ఎక్కువగా సామాజిక కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నానని చెప్పిన విషయాలు ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
ఇండస్ట్రీలోని గొప్ప నటులలో ఒకరైన చిరంజీవి తాను హీరోగా ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా ఇతర హీరోల సినిమాల ఈవెంట్లకు ఆహ్వానం వస్తే ఆ ఈవెంట్లకు కచ్చితంగా హజరవుతూ సినిమాలు సక్సెస్ సాధించడానికి చిరంజీవి తన వంతు కృషి చేస్తున్నారు.

పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడాల్లేకుండా అన్ని సినిమాల విషయంలో ఇదే విధంగా వ్యవహరిస్తూ తాను రీల్ హీరోను మాత్రమే కాదని రియల్ హీరోనని మెగాస్టార్ చిరంజీవి ప్రూవ్ చేసుకుంటున్నారు.సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చినా చిరంజీవి నో చెప్పిన సందర్భాలు దాదాపుగా లేవు.అయితే సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చినా చిరంజీవి రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.
ఇతర హీరోల సినిమాలకు సహాయం చేసే విషయంలో , ఈవెంట్లకు హాజరయ్యే విషయంలో చిరంజీవికి సాటి వచ్చే హీరో లేరని ఫ్యాన్స్ చెబుతున్నారు.స్వయంకృషితో ఊహించని స్థాయికి ఎదిగిన చిరంజీవి టాలెంట్ ఉన్నవాళ్లను ప్రోత్సహించే విషయంలో ముందువరసలో ఉంటారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కు చిరంజీవి 35 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.







