మాస్ రాజా రవితేజ హీరోగా పెళ్ళిసందడి బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘ధమాకా’.రెండు డిజాస్టర్స్ తర్వాత మాస్ రాజా తన అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేయడంలో మేకర్స్ సఫలం అయ్యారు.
ఈ సినిమా కోసం రవితేజ కూడా ఎప్పుడు లేని విధంగా రెండు వారాల ముందు నుండే వరుస ప్రొమోషన్స్ లో పాల్గొంటూ ఈ సినిమాపై హైప్ పెరిగేలా చేసాడు.ఇక భారీ అంచనాలతో ధమాకా సినిమా నిన్న డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.19 కోట్ల టార్గెట్ తో రవితేజ బరిలోకి దిగాడు.మరి ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రాబట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ధమాకా నిన్న సాలిడ్ హైప్ తో థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.
క్రాక్ తర్వాత ఈయన నటించిన ఈ సినిమా పోసిటివ్ ఎటాక్ తెచ్చుకుంది.దీంతో టీమ్ అంతా ఘనంగా సక్సెస్ సెలెబ్రేషన్స్ కూడా చేసుకుంటుంది.మంచి ఆక్యుపెన్సీతో దక్కించుకుని ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతుంది.నిన్న ఈ సినిమా ఫస్ట్ షో నుండే మంచి టాక్ రావడంతో ఓపెనింగ్స్ కుమ్మేసినట్టు తెలుస్తుంది.
మాస్ రాజా మరోసారి తన ‘పవర్’చూపించినట్టు తెలుస్తుంది.అలా ఫస్ట్ డే అయితే ధమాకా వరల్డ్ వైడ్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.ఈ సినిమా ఫస్ట్ డే 10 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.మరి రవితేజ కెరీర్ లోనే ఇది బెస్ట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి.
వీకెండ్ లో మరింత బెటర్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.దీంతో ఈ సినిమా తప్పకుండ బ్లాక్ బస్టర్ సినిమాల లిష్టులో చేరడం ఖాయం అని అనిపిస్తుంది.