హీరో అవకాశం కోసం రూ. ఐదు లక్షలు ఇచ్చి మోసపోయాను.. నిఖిల్ కామెంట్స్ వైరల్?

సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరో హీరోయిన్లు దర్శక నిర్మాతలు ఒకప్పుడు ఎన్నో కష్టాలను అవమానాలను ఎదుర్కొన్న వారు అని చెప్పవచ్చు.అప్పుడు వారు కష్టాలను, అవమానాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి నేడు సెలెబ్రెటిలుగా రాణిస్తున్నారు.

 Nikhil Talking About His Career Beginning Struggles Details, Nikhil, Tollywood,-TeluguStop.com

ఇప్పటికే ఎంతోమంది వారి కెరియర్ లో ఎదుర్కొన్న ఎన్నో చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కూడా తన కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడట.

మొదట హీరో అవ్వాలని సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ అసిస్టెంట్ డైరెక్టర్గా మారి ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నేడు స్టార్ హీరోగా ఎదిగాడు నిఖిల్.

ఇది ఇలా ఉండే తాజాగా అఖిల్ నటించిన 18 పేజెస్ సినిమా విడుదల అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలోని నిఖిల్ సరసన అనుపమ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా విడుదల సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.నిజం చెప్పాలి అంటే ఒక యంగ్ స్టార్ బయటికి వస్తున్నాడు అంటే డబ్బులు అడుగుతారు.

Telugu Pages, Nikhil, Nikhilsiddharth, Struggles, Tollywood-Movie

నువ్వు హీరోగా చేయాలా అయితే ఒక 50 లక్షలు లేదా కోటి రూపాయలు తీసుకొనిరా హీరో చేస్తాను అని అంటారు.మొదట్లో నన్ను కూడా అలాగే అడిగారు.అలా అడిగిన వారు ఎవరూ కూడా జెన్యూన్ కాదు.

అడిగిన వారెవరు కూడా సినిమా తీయరు.ఆ విధంగా నేను హీరో అవ్వడం కోసం మొదట్లో ఐదు లక్షలు ఇచ్చాను.

ఆ ఐదు లక్షలకు తగ్గట్టుగా ఒక లక్ష షూటింగ్ వేసి ఆపేశారు.ఆ సినిమా పేరు క్రికెట్ అనుకుంటా.

అయితే నాతో ఐదు లక్షల రూపాయలు ఇప్పించుకున్న వారు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఉన్నారో లేదో నాకు తెలియదు.మొదట్లో ఎన్నో కష్టాలను పడి అమ్మను డబ్బులు అడిగితీసుకెళ్లాను.

కానీ అదంతా ఫేక్ అని అర్థం అయింది అని చెప్పుకొచ్చాడు హీరో నిఖిల్.అలా హీరో చేస్తానని చెప్పి ఐదు లక్షల రూపాయలు మోసం చేశారు అని చెప్పుకొచ్చాడు నిఖిల్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube