పవన్ కళ్యాణ్ నుంచి క్రిస్మస్ గిఫ్ట్స్ వచ్చేసాయోచ్.. ఈసారి ఎవరెవరికి పంపించనున్నాడో?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో పాల్గొంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

 Pawan Kalyan Sending Christmas Gifts To His Directors Details, Pawan Kalyan, Chr-TeluguStop.com

రాజకీయ విషయానికి వస్తే వచ్చే ఎన్నికలలో ఎలా అయినా గెలవాలి అన్న పట్టుదలతో గట్టిగానే కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.

అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలకు సంబంధించి షూటింగ్ జరుగుతోంది.ఇదిలా ఉంటే క్రిస్మస్ పండుగ వచ్చింది అంటే చాలు పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజెనోవాతో కలిసి తన స్నేహితులకు సన్నిహితులకు క్రిస్మస్ గిఫ్ట్ పంపిస్తూ ఉంటారు.

ఇక రేపు అనగా ఆదివారం క్రిస్మస్ పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్నేహితులకు గిఫ్ట్ లు పంపిస్తున్నారు.ఆ క్రిస్మస్ గిఫ్ట్ లపై అన్నా లెజెనోవా పవన్ కళ్యాణ్ నుంచి ప్రేమతో అని రాసి ఉంటుంది.

Telugu Bandla Ganesh, Christmas Gifts, Venu Sriram, Friends, Mahesh Babu, Pawan

పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది స్టార్ హీరో మహేష్ బాబు దంపతులకు అలాగే తనతో కలిసి పనిచేసే డైరెక్టర్స్ కి, వీరాభిమాని బండ్ల గణేష్ కు, నితిన్ లాంటి స్నేహితులకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కానుకలు పంపిస్తూ ఉంటారు.ఈ క్రిస్మస్ వేడుకలకు ముందుగానే పవన్ కళ్యాణ్ నుండి గిఫ్ట్ అందుకున్న వకీల్ సాబ్ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.ఇప్పటికే చేరవలసిన వారికి చేరినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఇటీవలె పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు సినిమాతో పాటు, వినోదయ సీతం, భగత్ సింగ్ ఇలాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube