ఐపీల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2023 సీజన్ సంబంధించి ఒక్కో విషయం బయటకు వస్తూ వుంది.అందరూ ఎదురు చూస్తున్న మినీ వేలం ప్రక్రియ తాజాగా చాలా హాట్టహాసంగా ముగిసిందనే విషయం అందరికీ తెలిసినదే.
ఇక్కడే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి.ఈ మినీ వేలంలో ఏ జట్టు ఎవరిని సొంతం చేసుకోబోతుంది అన్నది చాలా ఆసక్తికరంగా సాగింది.
ఈ క్రమంలోనే ఈ మినీ వేలంలో ఎవరు ఎక్కువ ధర పలుకుతారు అన్న విషయంపై కూడా తీవ్ర స్థాయిలో సందిగ్దత నెలకొంది.
ఈ పరిస్థితులలో ఈ మినీ వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడు ఎవరు అన్న విషయంపై అయితే ఇంకా ఉత్కంఠత నెలకొంది.
కాగా ఇప్పటి వరకు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ రివ్యూలను సోషల్ మీడియా పోస్ట్ చేయగా ఎవరూ ఊహించని విధంగా IPL చరిత్రలోనే మునిపెన్నడూ లేని విధంగా అత్యధిక ధరను ఒక ఆటగాడు సొంతం చేసుకోవడం విశేషం.అవును, ఆ స్టార్ ప్లేయర్ మరి ఎవరో కాదు….
ఇంగ్లాండ్ జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న శ్యామ్ కరన్.నిన్న మొన్నటి వరకు అటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కొనసాగాడు శ్యామ్ కరన్.

కాగా తన అద్భుతమైన ప్రదర్శనతో విశేషంగా ఆకట్టుకున్నాడని చెప్పుకోవాలి.ముఖ్యంగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన T20 వరల్డ్ కప్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసాడు అని చెప్పుకోవాలి.అందుకే అంతటి అదృష్టం అతన్ని వరించింది.కాగా జరిగిన మినీ వేలంలో కూడా అన్ని ఫ్రాంచైజీలు అతని కొనుగోలు చేసేందుకు పోటీ పడటం కొసమెరుపు.ఈ క్రమంలోనే ఏకంగా మినీ వేలంలో అతనికి 18.5 కోట్లు భారీ ధరకు కొనుగోలు చేసింది ఓ ఫ్రాంచైజీ.దాంతో IPL చరిత్రలోనే అత్యధిక దరిక పలికిన ఆటగాడిగా శ్యామ్ కరన్ రికార్డ్ సృష్టించాడు అని చెప్పుకోవచ్చు.ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ 16.25 కోట్ల ధర పలికి టాప్ లో ఉండగా శ్యామ్ కరన్ ఆ రికార్డును అధిగమించాడు.18.50 కోట్లకు అతన్ని సొంతం చేసుకున్న జట్టు పంజాబ్ కింగ్స్ జట్టు.







