జొమాటో సంస్థ తెలియని వినియోగదారుడు ఉండనే ఉండడు.తరచూ వీరు తాము చేస్తున్న సర్వీస్ గురించి అభిప్రాయాలు కస్టమర్లను అడిగి తెలుసుకుంటూ వుంటారు.
తాము అందించే సేవలు ప్రజలకు ఎంత వరకు అందుతున్నాయో లేదో అని తెలుసుకుంటూ వుంటారు.కస్టమర్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగానే సేవల్లో మార్పులు చేర్పులు అనేవి వారు చేసుకుంటుంటారు.
ఇలా ఫీడ్ బ్యాక్‌ను పొందడానికి ఒక్కో సంస్థ ఒక్కో స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటుంది.యాప్‌ల ద్వారా సేవలు అందిస్తోన్న సంస్థలు ఆన్‌లైన్‌లోనే యూజర్ల ఫీడ్ బ్యాక్‌ను తెలుసుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే జొమాటో ‘కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్స్’ పేరుతో ఓ కాలమ్‌ను నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే.కాగా దీంట్లో యూజర్లు ఫుడ్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు అనేవి ఇవ్వొచ్చు.
తాజాగా ఈ కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ విషయంలో ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తమ కస్టమర్లకు ఓ విజ్ఞప్తి చేయగా అది కాస్త ఇపుడు వైరల్ అవుతుంది.ఫుడ్ డెలివరీ విషయంలో కస్టమర్లు అదే పనిగా చేస్తోన్న ఓ కామెంట్‌ను దయచేసి ట్వీట్ చేయొద్దంటూ ట్వీట్ చేయడం విశేషం.

‘భయ్యా.ఫుడ్‌ను మంచిగా ప్రిపేర్ చెయ్యండి’ అనే కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్‌ను ట్వీట్ చేయొద్దంటూ జొమాటో నెటిజన్లను ట్వీట్ రూపంలో వేడుకుంది.అక్కడే వచ్చింది అసలు చిక్కు.కాగా జొమాటో చేసిన ఈ ట్వీట్‌పై ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది.ఐతే జొమాటో చేసిన సదరు ట్వీట్‌కు భారీగా నెగిటివ్ రీట్వీట్స్ రావడం కొసమెరుపు.అలా ట్వీట్ చేయడం కరెక్ట్ కాదని, ఇంత మాత్రం దానికి కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్ కాలమ్‌ను ఎందుకు ఇచ్చినట్లు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
కస్టమర్ల ఫీడ్ బ్యాక్‌కు అనుగుణంగా ఫుడ్ మేకింగ్‌లో మార్పులు తీసుకురావాలని కానీ, జనులమీద వారి వ్యక్తిగత అభిప్రాయాలు రుద్దవద్దు అంటూ కొంతమంది మండిపడుతున్నారు.







