వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు.నేటి నుంచి మూడు రోజులపాటు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.
ఇందులో భాగంగా ఉదయం 11.50 గంటలకు అమీన్ పీర్ దర్గాలో సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.మధ్యాహ్నం కమలాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.







