ఇప్పుడు అమలులో వున్న టారిఫ్ రేట్లకే జనాలు బెంబేలెత్తుతుంటే ఇదెక్కడి వార్తరా నాయనా? అని మీరు కంగారు పడవచ్చు.కానీ, మీరు విన్నది నిజమే.
కొత్త ఏడాది 2023లో టెలికాం ఆపరేటర్లు మొబైల్ టారిఫ్‌లను పెంచాలనే యోచనలో వున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇక అదేగాని జరిగితే.
మొబైల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.అంటే ప్రస్తుతం ఉన్న మొబైల్ టారిఫ్‌లు కొత్త ధరలతో అప్డేట్ కానున్నాయి.
ఆదాయంతో పాటు మార్జిన్‌లను పెంచేందుకు Reliance Jio, Airtel వంటి టెలికాం సంస్థలు తమ ప్రస్తుత ప్లాన్‌ల ధరలను 10% వరకు పెంచే దిశగా అడుగులు వేయనున్నాయి.తాజాగా వెలువడిన జెఫరీస్ విశ్లేషకుల నివేదిక ప్రకారం… జియో, ఎయిర్‌టెల్‌తో సహా మిగిలిన టెలికాం ఆపరేటర్లు వచ్చే 3 ఏళ్లలో అంటే.FY23, FY24 & FY25 Q4లో 10% టారిఫ్‌ల పెంపును ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

3వ త్రైమాసికంలో Airtel, Vodafone idea, Reliance Jioలకు టెలికాం కంపెనీ పనితీరు కీలక సూచికగా మారనుంది.Airtel ఇప్పటికే ఉన్న కొన్ని ప్లాన్‌లపై టారిఫ్‌లను పెంచడం మొదలు పెట్టేసింది.ఈ క్రమంలోనే రూ.99 ప్లాన్ సహా కొన్ని చౌకైన ప్లాన్‌లను తొలగించేసింది.రూ.99 ప్లాన్ ఇప్పుడు రూ.155కి అందుబాటులోకి వచ్చిందనే విషయం తెలిసినదే.ఆదాయం కూడా చందాదారులపై ఆధారపడి వుంటుందనే విషయం తెలిసినదే.గత కొన్ని నెలల్లో, Airtel, Reliance Jio రెండూ తమ సబ్‌స్క్రైబర్ బేస్‌లో గణనీయమైన పెరుగుదలను చూశాయి.
మరోవైపు, Vi (Vodafone Idea) సబ్‌స్క్రైబర్‌లలో నష్టాన్ని చవి చుసిన సంగతి తెలిసినదే.







