టీటీడీపి యాక్టివ్... ! ఎక్కువ కంగారుపడుతున్న బీఆర్ఎస్ ? 

తెలంగాణలో తెలుగుదేశం యాక్టివ్ అయిపోయింది.మొన్నటి వరకు అక్కడ టిడిపి ఉన్నా లేనట్టుగానే పరిస్థితి ఉండేది.

 Ttdp Active Brs Worried More , Ttdp, Telangana Tdp, Kasani Gyaneshwar, Telangana-TeluguStop.com

పార్టీకి క్యాడర్ ఉన్నా పూర్తిగా వారంతా యాక్టివ్ గా ఉండేవారు కాదు.ఇక ముఖ్య నాయకులు అనుకున్న వారంతా ఇప్పటికే వివిధ పార్టీల్లో చేరిపోయి కీలక స్థానాలకు చేరుకున్నవారు ఎంతోమంది ఉన్నారు.

ఇక ఏపీలో టిడిపి పని ముగిసిన అధ్యాయమే అని, ఏపీలోనే పూర్తిగా ఆ పార్టీ కార్యకలాపాలు ఉంటాయని తెలంగాణలోని అన్ని పార్టీలు అంచిన వేశాయి .అయితే అనూహ్యంగా చంద్రబాబు 2023 ఎన్నికలలో తెలంగాణలో టిడిపి ని పోటీకి దింపాలని ఆలోచనకు వచ్చారు.ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు,  సెటిలర్స్ ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో టిడిపికి ఆదరణ ఉంటుందని అంచనా వేస్తున్నారు.దీనిలో భాగంగానే నిన్న ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
  ఈ సందర్భంగా అనేక అంశాల గురించి చంద్రబాబు ప్రస్తావించారు.పార్టీని వీడి వెళ్లిన పాత నేతలు అంతా మళ్లీ వెనక్కి రావాలని కోరారు.

ఎక్కడా టిఆర్ఎస్ ను విమర్శించకుండానే గతంలో తాను చేసిన అభివృద్ధిని చంద్రబాబు ప్రస్తావించారు.అయితే చంద్రబాబు ఖమ్మం సభ పై మిగతా పార్టీలు సైలెంట్ గానే ఉన్నా,  తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ మాత్రం సీరియస్ గానే రియాక్ట్ అయ్యింది.

చంద్రబాబు బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న మాజీ టిడిపి నేతలతో సహా ఎమ్మెల్సీ కవిత , వివిధ శాఖల మంత్రులు ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.చంద్రబాబు తెలంగాణ నుంచి ఏడు మండలాలని , సీలేరు విద్యుత్ ప్రాజెక్టును లాక్కున్నారని ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ విమర్శలు చేశారు.

ఏపీలో బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు ఖమ్మంలో సభను పెట్టారంటూ మరో మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు.
 

Telugu Chandrababu, Congress, Kavitha, Puvvada Ajay, Telangana, Telangana Tdp, T

ఖమ్మంలో కూడా చంద్రబాబు జై తెలంగాణ అనలేదని మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.చుక్కలు ఎన్ని ఉన్న చంద్రుడు ఒక్కటే అన్నట్లుగా తెలంగాణలో కేసీఆర్ ఒక్కడే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.టీ టీడీపీని తెలంగాణ ప్రజలు ఎప్పుడో రిజెక్ట్ చేశారని,  ఇప్పుడు వచ్చి రాజకీయం చేద్దామంటే కుదరదని ఆమె అన్నారు.

ఏపీ మూలాలు ఉన్న మీకు తెలంగాణ గడ్డపై ఏం పని అంటూ మరో మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు.ఈ విధంగా బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న వారంతా టీటీడీపీ యాక్టివ్ అవుతుండడంపై విమర్శలు దాడి మొదలుపెట్టారు.

మిగతా పార్టీలు ఈ విషయంలో మౌనంగా ఉండడం,  బీఆర్ఎస్ నేతలు మాత్రమే ఈ విధంగా రియాక్ట్ అవుతుండడం చూస్తుంటే టీటీడీపీ యాక్టివ్ కావడం వల్ల ఎక్కువ నష్టపోయేది తామే అన్న ఆందోళన బిఆర్ఎస్ లో కనిపిస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube