ఇప్పుడున్న రోజుల్లో కారు కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్లు కారుకు ఉన్న భద్రతా లక్షణాలతో పాటు లుక్ లక్షణాలపై చాలా శ్రద్ధ చూపిస్తున్నారు.ఈ నేపధ్యంలో కార్లకు క్రాష్ టెస్టులు అత్యవసరం అయిపోయాయి.చాలామంది ఈ క్రాష్ పరీక్షల ఆధారంగా కారును ఎంపిక చేయడంతో పాటు దానిని కొనుగోలు చేస్తుంటారు.2022వ సంవత్సరంలో కూడా అనేక ఫ్లాగ్‌షిప్ కార్లు ఈ గ్లోబల్ క్రాష్ టెస్ట్‌కు వెళ్ళాయి.చాలా కార్లు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాయి, ఇలా క్రాష్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన కార్లు కూడా చాలా ఉన్నాయి.అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మారుతీ ఎస్-ప్రెస్సో
ఎస్-ప్రెస్సో వయోజన ప్రయాణీకుల రక్షణ కోసం 20.03 పాయింట్లు, పిల్లల భద్రత విషయంలో 3.52 పాయింట్లను మాత్రమే స్కోర్ చేసింది.3 ఏళ్ల పిల్లల కోసం ఫ్రంటల్ ఇంపాక్ట్ టెస్ట్ సమయంలో చైల్డ్ సీట్ ముందుకు తల కదలికను నిరోధించలేకపోయింది.అయితే 18 నెలల పిల్లలకు, చైల్డ్ సీట్ మంచి తల, ఛాతీ రక్షణను అందించడంలో ఈ కారు ఫెయిల్ అయ్యింది.
మారుతి స్విఫ్ట్
వయోజన ప్రయాణీకుల భద్రత కోసం స్విఫ్ట్ 19.19 పాయింట్లు, పిల్లల రక్షణ కోసం 16.68 పాయింట్లు సాధించింది.సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో హెడ్ ప్రొటెక్షన్, పొత్తికడుపు, పెల్విక్ ప్రొటెక్షన్‌కు మంచిగా రేట్ రాగా, ఛాతీ రక్షణ పేలవమైన రేట్ వచ్చింది.కారుకు సైడ్ హెడ్ ప్రొటెక్షన్ లేనందున సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ చేయలేదు.
మారుతీ ఇగ్నిస్

ఇగ్నిస్ వయోజన ప్రయాణీకుల రక్షణలో 16.48 పాయింట్లు పిల్లల భద్రతలో కేవలం 3.86 పాయింట్లు సాధించింది.ఈ కారు.
డ్రైవర్‌తో పాటు ప్రయాణీకులకు తల, మెడకు రక్షణను అందించింది.కానీ డ్రైవర్ ఛాతీకి అంత రక్షణ అందించలేదు.అదే సమయంలో డ్రైవర్, ప్రయాణీకుల మోకాళ్ల రక్షణ కూడా సరిగా అందలేదు.
హ్యుందాయ్ టుక్సో

క్రాష్ టెస్ట్‌లో హ్యుందాయ్ ప్రీమియం ఎస్‌యూవీ టక్సన్ వైఫల్యం నిజంగా షాకింగ్ లాంటిది.వాస్తవానికి ఈ ఖరీదైన ఎస్యూవీ రూ.27 లక్షల నుండి 34 లక్షల శ్రేణిలో వచ్చినప్పటికీ, భద్రత పరంగా నిరుత్సాహ పరిచింది.లాటిన్ ఎస్ క్యాప్ సేఫ్టీ క్రాష్ టెస్ట్‌లో ఈ కారుకు జీరో సేఫ్టీ రేటింగ్ వచ్చింది.లాటిన్ ఎన్‌క్యాప్ భద్రతా క్రాష్ టెస్ట్ సమయంలో ఈ కారుకు జీరో రేటింగ్ ఇచ్చింది.రెండు ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన టక్సన్ వేరియంట్ క్రాష్ టెస్ట్‌లో విఫలమైంది.6 ఎయిర్‌బ్యాగ్‌లతో కూడిన వేరియంట్‌కు త్రీ స్టార్ సేఫ్టీ రేటింగ్ అందింది.







