ప్రయాణికులకు కేంద్రం శుభవార్త... ఎయిర్‌పోర్టుల్లో ఇక ఆ బాధ తప్పింది!

విమాన ప్రయాణం అనేది చాలా ఖర్చుతో కూడుకొన్నది మాత్రమే కాదు, చాలా గందరగోళంగా కూడా ఉంటుంది.మొదటి సరి విమానయానం చేసే ప్రయాణికులు పరిస్థితి అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు.

 Good News For Travelers No More Suffering At Airports , Central Government, Good-TeluguStop.com

ఏ ప్లాన్ లేకుండా, అవగాహన అనేది లేకుండా కొంతమంది ఎయిర్ పోర్టుకి వెళ్లి, అక్కడ అబాసుపాలవుతారు.అవును, ముఖ్యంగా లగేజ్ విషయంలో చాలామందికి కొన్ని విషయాలు తెలియవు.

దాంతో విమాన ప్రయాణం చేసేటప్పుడు పెద్ద ఎత్తున లగేజ్ తో వెళ్తూ వుంటారు.ఇలాంటి సమయాలలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి.

ఈ క్రమంలో ప్రయాణికుల బ్యాగేజీ నుంచి ఎలక్ట్రానిక్‌ పరికరాలు వంటివి ఉంటే బయటకు తీసి చూపాల్సిన పరిస్థితి ఉంటుంది.ఓ దశలో ఎంతో చక్కగా సర్దుకున్న బ్యాగ్ కూడా మొత్తం కింద పడేసి చూపించాల్సిన పరిస్థితి వస్తుంది.

అయితే ఇక ఆ అవసరం లేదని విమానయాన భద్రతా విభాగం అయినటువంటి BCAS (బ్యూరో ఆఫ్‌ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ) తాజాగా తెలిపింది.అవును, అటువంటి వస్తువులను తనిఖీ చేసేందుకు కంప్యూటర్‌ టోమోగ్రఫీ టెక్నాలజీని వినియోగించాలని సిఫారసు చేసింది.

ఇది ప్రయాణికులకు శుభవార్తగానే పరిగణించాలి.ఇకనుండి మీరు విమానంలో ప్రయాణించేటప్పుడు ఎయిర్‌పోర్ట్‌లలో తనిఖీల కోసం బ్యాగుల నుంచి ఫోన్లు, ఛార్జర్లు, ల్యాప్‌టాప్‌ వంటివి బయటకు తీసి చూపించే అవసరం లేదు.అటువంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను బ్యాగుల్లో నుంచే తనిఖీ చేసేలా అత్యాధునిక స్కానర్లను ఎయిర్‌ పోర్టుల్లో ఏర్పాటు చేయాలని BCAS ప్రతిపాదనలు చేసింది.ప్రస్తుతం విమానాశ్రయాల్లో బ్యాగేజీలోని వస్తువుల టూ-డైమెన్షనల్‌ దృశ్యాలను చూపే స్కానర్లు ఉన్నాయి.

వాటి స్థానంలో కంప్యూటర్‌ టోమోగ్రఫీ పరికరాలను ఏర్పాటు చేస్తే త్రీడీ దృశ్యాలు కనిపిస్తాయని బీసీఏఎస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌ జైదీప్‌ ప్రసాద్‌ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube