తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ బ్యూటీ, నటి కీర్తి భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
మొదటి నాలుగైదు వారాలలోనే ఎలిమినేట్ అవుతుంది అనుకున్న కీర్తి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో సెకండ్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే.అయితే డబ్బులు ఎరవేసిన కూడా వద్దని అభిమానులు తాను ఏ పొజిషన్లో చూడాలి అనుకుంటున్నారు ఆ స్థానానికి కట్టుబడి ఉంటాను అని తెలిపింది కీర్తి.
ఇక బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచింది కీర్తి.బిగ్బాస్ ఓ ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.
మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కీర్తిని తెలుగింటి అమ్మాయిగా ఇంట్లో కూతురుగా స్వీకరించారు.దాంతో ఆమెకు భారీగా ఓట్లు వేసి ఆమెను టాప్ 3 పొజిషన్ కి తీసుకెళ్లారు.
ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ షో ముగియడంతో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది కీర్తి.ఈ క్రమంలోని ఇంటర్వ్యూలో భాగంగా కీర్తి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ.నేను ఒక అతన్ని ప్రేమించాను.
ఇద్దరం చాలా బాగా ఉండే వాళ్ళం.కానీ ఒక పరిస్థితిలో అతడు నాకు బ్రేకప్ చెప్పి నన్ను వదిలేశాడు.
నాకు బ్యాక్ గ్రౌండ్ లేదు కదా.మరి నేను ఏం చేసి ఇండస్ట్రీకి వచ్చాను అన్న అనుమానంతో బ్రేకప్ చెప్పి నన్ను వదిలేశాడు అని తెలిపింది కీర్తి.

ఇక్కడిదాకా వచ్చింది అంటే ఏం చేసి వచ్చిందో అని దగ్గర వాళ్ళే చులకనగా మాట్లాడినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది.అతనికి కూడా అలా అనిపించింది అంటే నేను తప్పుడు వ్యక్తిని ఎంపిక చేసుకున్నట్లే.ఇక ఈ విషయం గురించి మాట్లాడితే నేను మళ్ళీ ఏడ్చుకుంటూ ఉండిపోతాను.ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను ఆ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు అని తెలిపింది కీర్తి.త్వరలోనే మళ్లీ ఇంకొక పాపని దత్తత తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది కీర్తి.








