టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ఆయన ఫ్యామిలీ గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న మహేష్ బాబు స్టార్ హీరోగా నిలిచాడు.
ఇక ఈయన భార్య నమ్రత గురించి అందరికీ పరిచయమే.ఈమె కూడా ఇండస్ట్రీకి చెందిన నటి.తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించింది.
ఇక మహేష్ బాబు నమ్రత కలిసి ఓ సినిమాలో కూడా నటించగా ఆ సమయంలో వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.
దీంతో 2005లో పెళ్లి చేసుకోగా వీరికి గౌతమ్ కృష్ణ, సితార అనే పిల్లలు ఉన్నారు.ఇక నమ్రత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.తన పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.నమ్రత సినిమాలకు దూరంగా ఉంటూ తన పిల్లల కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తుంది.
మహేష్ బాబు కూడా తన ఫ్యామిలీ పట్ల బాగా కేర్ తీసుకుంటాడు.ఒకవైపు సినిమాలే కాకుండా మరోవైపు ఫ్యామిలీ జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.సినిమా సమయంలో బ్రేక్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో బాగా టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటాడు.ఈ ఫ్యామిలీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.
ముఖ్యంగా మహేష్ గారాల కూతురు సితార మాత్రం సోషల్ మీడియాలో బాగా ఎనర్జీ గా కనిపిస్తుంది.తల్లి తండ్రి కంటే ఎక్కువగా పోస్ట్ షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.
పూర్తి ఇండస్ట్రీ పరిచయం కూడా కానీ సితార తండ్రి నుండి ఎంతో అభిమానం సొంతం చేసుకుంది.అతి చిన్న వయసులోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సితార తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ తన వైపు మలుపుకుంది.
చిన్నవయసులోనే సోషల్ మీడియాలో తన పేరుమీద ఖాతాలను కూడా సృష్టించుకుంది.ఇక ఆ సోషల్ మీడియా ఖాతాలో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, తన డాన్స్ వీడియో లను బాగా షేర్ చేసుకుంటుంది.అంతే కాకుండా తన ఫ్యామిలీ గురించి కూడా చాలా విషయాలు పంచుకుంటూ ఉంటుంది.
తన సోదరుడితో కలిసి బాగా ఆడుకుంటున్న వీడియోలను కూడా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు తన తండ్రితో సినిమా సెట్ కు వెళ్లి అక్కడ జరిగిన విషయాలు కూడా పంచుకుంటుంది.
ప్రతి రోజు ఏదో ఒక పోస్టు తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది సితార.పైగా ఈ మధ్య వెండితెరపై కూడా అడుగుపెట్టింది.
ఇక సితార భవిష్యత్తులో హీరోయిన్ గా అడుగుపెడుతుంది అని గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చింది సంగతి తెలిసిందే.దీంతో ఇప్పటినుంచి తనకు ప్రతి విషయంలో బాగా సపోర్ట్ ఇస్తున్నారు పేరెంట్స్.అయితే సితార తాజాగా తన ఇన్స్టా వేదికగా ఒక ఫోటో షేర్ చేసుకుంది.అందులో తను కాస్త గ్లామర్ లుక్ లో కనిపించింది.ఇక సితార అలా కనిపించడం మొదటిసారి.
దీంతో ఆ ఫోటోలు చూసిన కొందరు లైక్స్ కొట్టగా మరికొందరు నెగటివ్ గా కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఓ నెటిజన్ నమ్రతను ట్యాగ్ చేస్తూ ఇది చాలా వరస్ట్ అంటూ.ఒక తల్లి కూడా తనను అలా ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు అని.ఇప్పటికీ తను చాలా చిన్న పిల్ల అంటూ.ఇప్పుడే ఇలా ఉంటే 18 ఏళ్ల తర్వాత మాట వినరు అన్నట్లుగా కామెంట్ పెట్టారు.
ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.