వారసుడు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ పరిస్థితి ఏంటీ?

తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా దిల్ రాజ్ నిర్మాణం లో వంశీ పైడిపల్లి దర్శకత్వం లో రూపొందుతున్న ద్వి భాషా చిత్రం వారసుడు.ఈ సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

 Vijay Varasudu Movie Release In Telugu States , Dil Raju, Director Vamshi Paidip-TeluguStop.com

దాదాపుగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా తమిళనాట వంద కోట్ల కు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అంటూ సమాచారం అందుతుంది.ఇదే సమయం లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 50 కోట్ల కు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో విజయ్ సినిమా కి అంత మార్కెట్ లేనే లేదు.ఇప్పటి వరకు ఆయన నటించిన ఏ ఒక్క సినిమా కూడా కనీసం 10 కోట్ల కలెక్షన్స్ రాబట్ట లేక పోయింది.

అయినా కూడా వారసుడు సినిమా కు ఏకంగా 50 కోట్ల రూపాయల బిజినెస్ జరగడం ఏంటి అంటూ చాలా మంది ముక్కున వేలు వేసుకుంటున్నారు.అసలు విషయం ఏంటంటే ఈ సినిమా ను ఎక్కువ ఏరియాల్లో దిల్ రాజు స్వయం గా విడుదల చేస్తున్నాడు.కనుక బిజినెస్ లెక్కలు అంతా కూడా అబద్ధం అని సమాచారం అందుతుంది.అయితే ఈ సినిమా యొక్క హక్కులు అమ్ముడు పోతే కచ్చితంగా 50 కోట్లు వచ్చేవి అనేది వారసుడు చిత్ర యూనిట్ సభ్యుల యొక్క అభిప్రాయం అయ్యి ఉండవచ్చు.

వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు ఆసక్తి ఉంటుంది.దిల్‌ రాజు సినిమా కనుక కచ్చితంగా తెలుగు సినిమా స్థాయి లో ఉంటుందని అంతా భావిస్తున్నారు.

అందుకే తెలుగులో సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలకు పోటీ అన్నట్లుగా ఉన్నా కూడా భారీ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని చిత్ర యూనిట్ సభ్యులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.మరి వారసుడు ఆ స్థాయిలో కలెక్షన్స్ నమోదు చేస్తాడా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube