అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2 చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేక్షకులు పుష్ప 2 సినిమా కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం లో దర్శకుడు సుకుమార్ కాస్త ఎక్కువ సమయం తీసుకొని మరీ స్క్రిప్ట్ ను రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.స్క్రిప్ట్ కోసం ఏకంగా 10 నెలల సమయం తీసుకున్న దర్శకుడు సుకుమార్ ఇటీవల షూటింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టాడు అంటూ సమాచారం అందుతుంది.
తాజాగా చిత్ర సభ్యులు ఈ సినిమా విడుదల తేదీ పై ఒక క్లారిటీ ఇచ్చారు.
పుష్ప 2 విషయంలో దర్శకుడు సుకుమార్ ని హడావుడి చేయాలనుకోవడం లేదు.మెల్లగానే సినిమా ని చేస్తామంటూ స్వయంగా అల్లు అర్జున్ కూడా చెప్పుకొచ్చాడు.దీన్ని బట్టి చూస్తుంటే సినిమా 2023 లో ఖచ్చితం గా విడుదల కాదని క్లారిటీ వచ్చేసింది.
భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.ఈ సినిమా నిర్మాణం కు ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ వారు చెబుతున్నారు.
అంత బడ్జెట్ తో సినిమా ను హడావుడిగా తీయాల్సిన అవసరం లేదని అల్లు అర్జున్ కూడా భావిస్తున్నాడు.అందుకే సినిమా విడుదల ఆలస్యమైన పర్వాలేదు.కానీ బాగా రావాలని సుకుమార్ తో అన్నాడట.అన్నీ సవ్యంగా జరిగితే.
అనుకున్నట్లుగా అయితే 2024వ సంవత్సరం సమ్మర్ కానుకగా సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.అది కాదంటే కాస్త ముందుగానే సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని మైత్రి మూవీ మేకర్స్ ద్వారా సమాచారం అందుతుంది.