వచ్చే ఏడాది సంక్రాంతి పోటీ రసవత్తరంగా సాగబోతోంది.2023 సంక్రాంతి రేస్ కోసం స్టార్ హీరోలు పోటీ పడుతున్నారు.ఇక ఈసారి సంక్రాంతికి మన స్టార్ హీరోల్లో ఇద్దరు పోటీకి దిగుతున్న విషయం విదితమే.సీనియర్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత పోటీ పడబోతున్నారు.
దీంతో ఈ పోటీ ఇప్పుడు మరింత ఆసక్తిగా మారిపోయింది.
ప్రెసెంట్ చిరు చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య ఒకటి.
ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇక బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహ రెడ్డి సినిమా చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలోనే రాబోతున్నాయి.నందమూరి, మెగా హీరోల సినిమాలు ఒకేసారి రావడం కూడా ఫ్యాన్స్ కు రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

వీరిద్దరి సినిమాలకు ఒకే క్రేజ్ ఉంది అనే చెప్పాలి.ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు కూడా బాగానే ఆకట్టు కుంటున్నాయి.అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా పాటలు యూట్యూబ్ లో ఎక్కువుగా వ్యూస్ అందుకుంటున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.ఇద్దరి పాటలు ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో వ్యూస్ దృష్ట్యా వాల్తేరు వీరయ్య హై లో ఉన్నాడు.

‘జై బాలయ్య’ మెగాస్టార్ బాస్ పార్టీ కంటే ముందుగానే రిలీజ్ అయిన మెగాస్టార్ సాంగ్ నే అత్యధిక వ్యూస్ అందుకుంది.తాజాగా ఈ సినిమాల నుండి రెండవ పాట రిలీజ్ అయ్యింది.చిరంజీవి సినిమా నుండి శ్రీదేవి చిరంజీవి అనే రొమాంటిక్ పాట రాగా.బాలయ్య సినిమా నుండి సుగుణ సుందరి అనే పాట రిలీజ్ అయ్యింది.వీటిలో కూడా ముందుగా చిరు సాంగ్ 6.16 మిలియన్ వ్యూస్ అందుకోగా.24 గంటల్లో సుగుణ సుందరి 4.83 మిలియన్ వ్యూస్ రాబట్టింది.లైక్స్ పరంగా కూడా చిరునే ముందు ఉన్నాడు.ఇది వీరి మధ్య మాత్రమే కాదు థమన్, దేవి శ్రీ మధ్య పోటీ అని కూడా చెప్పవచ్చు.







