మంత్రి కేటీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.డ్రగ్స్ కేసు ఆరోపణలపై కేటీఆర్ అప్పుడే స్పందించాల్సిందని తెలిపారు.
తాను ఎప్పుడో ఛాలెంజ్ చేస్తే కేటీఆర్ ఇప్పుడు స్పందించడం ఏంటని ప్రశ్నించారు.అప్పుడే వెంట్రుకలు ఇచ్చి ఉంటే నిజం తేలేదని పేర్కొన్నారు.
కేటీఆర్ విదేశాల్లో చికిత్స చేయించుకున్నారని, ఇప్పుడు దొరకననే ధీమాతోనే స్పందించారని ఆరోపించారు.తాను సంస్కార హీనుడిని కాదన్న బండి సంజయ్ మీలాంటి భాషను వాడను అని చెప్పారు.
కేటీఆర్ ముఖంలో భయం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.







