కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ వ్యాప్తంగా జనజీవనాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ 19 మళ్లీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జనజీవనాన్ని అతలాకుతలం చేసే అవకాశం ఉందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.అందువల్ల ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.
అంతేకాకుండా చైనా ప్రజలు కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకొని కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండాలని అనుకుంటున్నారు.కోవిడ్ రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చైనా ప్రజలు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రభుత్వం ఎక్కువగా వ్యాక్సిన్ వేయాకపోవడంతో ఎలాగైనా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారికి తోచిన ప్రయత్నాలన్నీ చేస్తూ బిజీగా ఉన్నారు.అంతేకాకుండా శరీరంలో కోవిడ్ ను తట్టుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తి ఎంతో అవసరం ఉంది.
అందుకోసం చైనా ప్రజల ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ గా ఉండడం వల్ల దీనిని పెంచుకోవడానికి చాలా ప్రజలు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.దీనివల్ల కోవిడ్ బారిన పడ్డవారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి విషమించి కన్నుమూస్తున్నారు.
చైనా దేశం బయటకు చెప్పడం లేదు కానీ చైనాలో ఇప్పుడు కరోనా విలయతాండవం చేస్తున్నట్లు సమాచారం.దీన్ని నివారించేందుకు చైనా ప్రభుత్వం జీరో పాలసీని అమలు చేస్తుంది.

చైనా దేశ ప్రజలు రోగనిరోధక శక్తి పెంచడానికి నిమ్మకాయలు ఎంతో ఉపయోగపడుతున్నాయి.కొవిడ్ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు తమ శరీరనికి విటమిన్ సి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.ఇందులో భాగంగానే నిమ్మకాయల విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది.కోవిడ్ కు ముందు ఇవి ఐదు నుంచి 6 టన్నులు మాత్రమే అమ్ముడు పోయమని చెబుతున్నారు.కానీ ఇప్పుడు మాత్రం 20 నుంచి 30 టన్నుల వరకు అమ్ముడుపోతున్నాయని సమాచారం.నిమ్మకాయలను చైనా దేశ ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
వీటితోపాటు నారింజ, పియర్స్, పిచ్ వంటి పండ్లను కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.డిమాండ్ పెరగడంతో ప్రజలు ఈ పండ్ల ను అమ్మే దుకాణల వద్ద భారీగా తిరుగుతున్నారు.







