కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రపై కరోనా ప్రభావం చూపుతోంది.కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలంటూ రాహుల్ గాంధీకి కేంద్రం హుకుం జారీ చేసింది.
ఒకవేళ కరోనా రూల్స్ పాటించకపోతే జోడో యాత్రను నిలిపి వేయాలని కీలక ఆదేశాలు ఇచ్చింది.ఈ మేరకు రాహుల్ గాంధీతో పాటు రాజస్థాన్ ముఖ్యమంత్రికి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాన్ సుక్ మాండవీయ లేఖ రాశారు.
ఇటీవలే రాహుల్ జోడో యాత్ర రాజస్థాన్ మీదుగా హర్యానాలోకి ప్రవేశించింది.మాస్కులు ధరించి, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లనే యాత్రకు అనుమతించాలని కేంద్రం సూచించింది.
ఇప్పటికే కరోనాపై అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే.







