దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది.ఢిల్లీ ఎన్సీఆర్ లో ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
గతంలో వాయు కాలుష్యం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం భవన నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఇప్పటికీ సర్కార్ విధించిన నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 352 పాయింట్లుగా ఉంది.నోయిడాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 394 పాయింట్లుగా ఉందని అధికారులు చెబుతున్నారు.







