తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పూజ హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.
హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమా అవకాశాలని అందుకుంటూ దూసుకుపోతోంది.ఇకపోతే ఈ ఏడాది పూజ హెగ్డే కు అంతగా కలిసి రాలేదు అని చెప్పవచ్చు.
ఎందుకంటే పూజ హెగ్డే నటించిన ఆచార్య,బీస్ట్,రాధే శ్యామ్ లాంటి సినిమాలు వరుసగా డిజస్టర్ గా నిలిచాయి.ఈ క్రమంలోనే ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.
అయితే పూజా కి అవకాశాలు తగ్గడానికి కారణం వేరే ఉందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.సాధారణ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే వరసగా అవకాశాలు అందుకోవడం మాత్రమే కాకుండా పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఈ క్రమంలోనే పూజా తన రెమ్యూనరేషన్ పెంచేసిందనే టాక్ వినిపించింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ విషయం పై పూజా హెగ్డే స్పందించింది.ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ.రెమ్యూనరేషన్ కోసం నిర్మాతల్ని ఇబ్బంది పెట్టలేదు.నేను అసలు పారితోషికం పెంచనేలేదు.అవన్నీ మీడియాలో వస్తున్న రూమర్స్ మాత్రమే.

పారితోషికం కోసమే పనిచేయాలంటే.ఇప్పటికే చాలా సినిమాలకు అడ్వాన్సులు తీసుకుని బిజీగా ఉండేదాన్ని.కానీ నేనేం అంత బిజీగా లేను.మంచి కథల కోసం చూస్తున్నాను.అలాంటి స్టోరీస్ నా దగ్గరకొస్తే డబ్బు విషయమే అస్సలు ఆలోచించను.నిర్మాత ఇచ్చిన ఆఫర్ కే పనిచేస్తాను.
నిర్మాతలు అడ్వాన్స్ ఇస్తున్నారు కదా అని తీసి అకౌంట్ లో వేసుకోను.ముందు సినిమాలో పాత్ర, కథ ఎలా ఉందని చూస్తా.
ఆ తర్వాత రెమ్యూనరేషన్ గురించి ఆలోచిస్తా.కేవలం డబ్బు కోసమే అయితే సినిమా రంగంలోకి వచ్చేదాన్ని కాదు అని చెప్పుకొచ్చింది పూజ హెగ్డే.







