ఆన్ లైన్ గేమ్ ఆడి ఓ యువకుడు రూ.95 లక్షలు పొగొట్టుకున్నాడు.ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ సీతారాంపూర్ లో చోటు చేసుకుంది.మొబైల్ లో ఓ గేమ్ ను డౌన్ లోడ్ చేసిన డిగ్రీ విద్యార్థి తండ్రి అకౌంట్ ను లింక్ చేసి గేమ్ ఆడాడు.
అకౌంట్ లో నగదు మొత్తం ఖాళీ అవ్వడంతో తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు.ఇటీవలే విద్యార్థి తండ్రికి భూ సేకరణ పరిహారం కింద ప్రభుత్వం నగదును ఇచ్చింది.అటు భూమి పోయి, ఇటు డబ్బులు కూడా పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.







