తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సునీత ప్రస్తుతం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనినీ రెండవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరి వివాహం తర్వాత సునీత తన కొత్త జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
అయితే సునీత వివాహం చేసుకున్నటువంటి రామ్ వీరపనేని బ్యాక్ గ్రౌండ్ గురించి కూడా అందరికీ తెలిసిందే.
ఈయన అసలు పేరు రామకృష్ణ వీరపనేని ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివిన ఈయన ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు.
ఈయనకు పలు కంపెనీలలో వందల కోట్ల రూపాయల షేర్స్ ఉన్నాయని తెలుస్తోంది.అదేవిధంగా ప్రముఖ మ్యూజిక్ సంస్థ అయినటువంటి మ్యాంగో మీడియాకి ఈయన సీఈవోగా పనిచేస్తున్నారు.ఇలా మ్యాంగో మీడియాకి సునీత ఎన్నో పాటలు పాడారు.ఇలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి కూడా చేసుకున్నారు.

ఇక తన మ్యాంగో మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా తమిళ,హిందీ బ్లాక్ బస్టర్ సినిమాలను డబ్బింగ్ రైట్స్ తీసుకొని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేస్తూ భారీగా సంపాదించారు.ఈయనకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి కొన్ని వందల కోట్ల విలువ చేస్తుందని అలాగే ఈయన కూడా వందల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించినట్లు సమాచారం.ఇక హైదరాబాదులో కూడా పలు ప్రాంతాలలో అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయని సమాచారం.మొత్తానికి రామ్ వీరపనేని బిజినెస్ చేస్తూ వందల కోట్ల ఆస్తులు కూడా పెట్టారని తెలుస్తోంది.







