కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.పార్టీలోని ప్రతీ కార్యకర్త పీసీసీ చీఫ్ తోనే సమానమని చెప్పారు.
గాంధీభవన్ లో ఉంటూ పైరవీలు చేసుకునే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.కాంగ్రెస్ లో పరిణామాలపై దిగ్విజయ్ సింగ్ ను నియమించడం హర్షణీయమన్నారు.
ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ లో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.హుజురాబాద్ లో రేవంత్ రెడ్డి ఎందుకు ప్రచారానికి వెళ్లలేదో విచారించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా మునుగోడులో తనను బూతులు తిడుతున్న వారిపై విచారణ జరిపించాలన్నారు.కమిటీల్లో సీనియర్లకు అన్యాయం జరిగిందన్న ఆయన దిగ్విజయ్ ఈ విషయాల అన్నింటిపై విచారించాలని వెల్లడించారు.







