టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా నిలిచి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో ప్రభాస్.ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో పరుగులు తీస్తున్నాడు.
తొలిసారిగా 2002లో ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ తర్వాత రాఘవేంద్ర, వర్షం సినిమాలో నటించి మంచి గుర్తింపు అందుకోవడంతో వరుస సినిమాలలో ఓ రేంజ్ లో దూసుకెళ్లాడు.
అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదగడంతో బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు.ఈ సినిమాతో కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి అభిమానం పెంచుకున్నాడు.
ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోలకున్న గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
ప్రభాస్ కు కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా మంచి అభిమానం ఉంది.
ఈయన సినిమాల కోసం ఆ అభిమానులు ఎదురు చూసే చూపులు అంతా ఇంతా కాదు.ఈయన సినిమా థియేటర్ లో విడుదలైందంటే చాలు ఫ్లెక్సీలతో రచ్చ రచ్చ చేస్తారు అభిమాన సంఘాలు.
ఇక ఈయన పుట్టినరోజు లలో పలు సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు.ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈయన నటించిన పలు పాన్ ఇండియా సినిమాలు విడుదలై ఫ్లాప్ లు అందుకున్నప్పటికీ అయినా కూడా ఆయనకు వరుస అవకాశాలు వస్తున్నాయి.ఇప్పటికే కోసం టాలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతలు బాగా ఎదురుచూస్తున్నారు.
ప్రభాస్ కి కాస్త బ్రేక్ దొరికితే చాలు వెంటనే దర్శకులు వచ్చి కథను వినిపిస్తున్నారు.

ఎందుకంటే ప్రభాస్ రేంజ్ ప్రస్తుతం అలా ఉంది కాబట్టి.ఆయన నటించిన ఆది పురుష్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక ప్రాజెక్టు కే, స్పిరిట్ అనే రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు కూడా ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉన్నాయి.
అయితే ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోవటానికి కారణం బాహుబలి సినిమా అని చెప్పవచ్చు.
ఇక ఇదంతా పక్కన పెడితే ఈయన కోసం ఇప్పటివరకు బాలీవుడ్ డైరెక్టర్లే ఎదురు చూస్తున్నారు అని అనుకున్నాం కానీ ఇప్పుడు హాలీవుడ్ డైరెక్టర్స్, హాలీవుడ్ ఆర్టిస్ట్ లు కూడా ను గురించి ఎంక్వయిరీ చేయడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇప్పటివరకు ఏ తెలుగు హీరో గురించి హాలీవుడ్ డైరెక్టర్స్ ఎంక్వయిరీ చేయలేదు.

అలాంటిది ప్రభాస్ ని ఎంక్వయిరీ చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వపడుతుందని చెప్పవచ్చు.తాజాగా నిర్మాత అశ్విన్ దత్ ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.మొదటిసారి హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రభాస్ గురించి ఇంత ఎంక్వయిరీ చేయడం మొదటిసారి అని.ఇక నేను కచ్చితంగా చెప్పగలను.ఇప్పుడు నాగ్ అశ్విన్ తీసే సినిమా తర్వాత.
ప్రభాస్ ఓన్లీ ఇంగ్లీష్ సినిమాలలో నటించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.







