పెంపుడు జంతువులను తమ ఇళ్లలో పెంచుకునేవారు వాటితో ఆడుకునేటప్పుడు తమ చేతిని వాటి నోటిలో పెట్టడాన్ని మనం చూసేవుంటాం. డెన్మార్క్‌కు చెందిన హెన్రిక్ క్రీగ్‌బామ్ కూడా అదే తప్పు చేశాడు.
ఫలితంగా అతను తన ప్రాణాన్ని మూల్యంగా చెల్లించవలసి వచ్చింది.ఆయన తమ ఇంటిలోని పెంపుడు పిల్లితో ఆడుకుంటూ తన చేతిని పెంపుడు పిల్లి నోటిలో పెట్టాడు.
ఫలితంగా అది తని చేతిని కొరికింది.పిల్లి కొరకడంతో హెన్రిక్ చేతులకు ఇన్ఫెక్షన్ వచ్చింది.
కొద్దిసేపటికే అతని చేయంతా వాచిపోయింది.హెన్రిక్ ఆసుపత్రికి చేరుకోగా, అక్కడి వైద్యులు హెన్రిక్ పరిస్థితి చాలా విషమంగా ఉందని, వెంటనే అతన్ని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకున్నారు.
అతను కొన్ని నెలల పాటు చికిత్స పొందాడు.
హెన్రిక్ పరిస్థితి మరింత దిగజారడంతో వైద్యులు అతడికి 15 ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది.అయినప్పటికీ, హెన్రిక్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు.మరోమార్గం లేక వైద్యులు చివరకు హెన్రిక్ వేలిని కత్తిరించారు.
దీని తర్వాత కూడా హెన్రిక్‌కు ఎలాంటి ఉపశమనం లభించలేదు.అతను కొన్ని రోజుల తర్వాత మరణించాడు.
హెన్రిక్ పెంపుడు పిల్లి అతని వేలిని కొరికినప్పుడు, పిల్లి నోటి నుండి వైరస్ హెన్రిక్ శరీరంలోకి ప్రవేశించింది.ఈ వైరస్ హెన్రిక్ రోగనిరోధక శక్తిని తీవ్రంగా దెబ్బతీసింది.
ఫలితంగా అతనికి న్యుమోనియా, ఆర్థరైటిస్ మధుమేహం వంటి వ్యాధులు వచ్చాయి.పిల్లి కరవడంతో అతను అనారోగ్యానికి గురయ్యాడని, ఫలితంగా మరణానికి చేరువయ్యాడని హెన్రిక్ భార్య తెలిపింది.
ఏదైనా జంతువు కరిస్తే దానిని తేలికగా తీసుకోవద్దని, అది మీ పెంపుడు జంతువు అయినప్పటికీ వెంటనే వైద్యులను సంప్రదించి చెకప్ చేయించుకోవాలని ఆరోగ్యం నిపుణులు సూచిస్తున్నారు.