సంచలనం సృష్టించిన దిశ హత్యాచార నిందితుల ఎన్కౌంటర్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.పూర్తిస్థాయి విచారణ జరపాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో సుప్రీం నియమించిన కమిషన్ నివేదికపై విచారణ చేపట్టింది తెలంగాణ హైకోర్టు.ఈ మేరకు ఎన్కౌంటర్లో పాల్గొన్న పది మంది అధికారులపై సెక్షన్ 302, 201, 34 కింద కేసులు నమోదు చేయాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు.
అనంతరం తదుపరి వాదనలు వినేందుకు విచారణను జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది.ఇప్పటికే అమికన్ క్యూరిగా దేశాయ్ ప్రకాశ్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.







